Youtube: యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు.. 8 ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్‌లోనే ఎన్నో విషయాలు, తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలో లక్షలాది ఛానళ్లు ఉన్నాయి. కోట్లాదిమంది ప్రతిరోజూ వీక్షిస్తుంటారు. అయితే యూట్యూబ్‌లో నిజాలతో పాటు అవాస్తవమైన సమాచారం, ఫేక్ న్యూస్‌లు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు యూట్యూబ్ ఛానళ్లపై కొరడా ఝళిపించింది.తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లను బస్ట్ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రకటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించడం, ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలు వంటివి పోస్ట్ చేసినందుకు ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రకటించింది.
ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్‌లోనే ఎన్నో విషయాలు, తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలో లక్షలాది ఛానళ్లు ఉన్నాయి. కోట్లాదిమంది ప్రతిరోజూ వీక్షిస్తుంటారు. అయితే యూట్యూబ్‌లో నిజాలతో పాటు అవాస్తవమైన సమాచారం, ఫేక్ న్యూస్‌లు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు యూట్యూబ్ ఛానళ్లపై కొరడా ఝళిపించింది. తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లను బస్ట్ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రకటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించడం, ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలు వంటివి పోస్ట్ చేసినందుకు ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రకటించింది.
యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కెపిఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్‌పిఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వాస్తవ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ యూట్యూబ్ ఛానళ్లను పరిశీలిస్తే వరల్ట్ బెస్ట్ న్యూస్‌కు 1.7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో 18 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. అయితే ఈ యూట్యూబ్‌లో ఇండియన్ ఆర్మీ గురించి తప్పుగా సూచిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ఛానల్‌కు 3.43 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీనికి మొత్తం 23 కోట్ల వ్యూస్ ఉన్నాయి. అయితే ఇందులో ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఇక 4.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న ఎస్‌పిఎన్ 9 న్యూస్. ప్రధాని, రాష్ట్రపతితో సహా పలువురికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేపీఎస్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్‌కు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో 20 రూపాయలకు వంటగ్యాస్ సిలిండర్లు, 15 రూపాయలకు లీటర్ పెట్రోల్ లభిస్తాయని.. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఆర్డర్లు, పలు నిర్ణయాలకు సంబంధించి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. 3.5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న క్యాపిటల్ టీవీ అనే ఛానల్‌లో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలుకు సంబంధించిన పలు ఉత్తర్వుల గురించి తప్పుడు వార్తలను అందించారని పేర్కొన్నారు. 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ‘యహన్ సచ్ దేఖో’ అనే యూట్యూబ్ ఛానల్‌లో మిలియన్ల వీక్షణలు ఉన్నాయి. అయితే ఇందులో ఎర్న్ ఇండియా టెక్ ఆధార్ కార్ట్, పాన్ కార్డ్.. అలాగే ఇతరులకు సంబంధించిన నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకే ఈ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..