AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Eamcet 2023 Counselling: ఆగస్టు17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌.. మిగిలిపోయిన సీట్లు 19 వేలు

జరిగిన తుది విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే సీటు రద్దవుతుంది. తుది విడతలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరగనుంది. జోసా కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కాబట్టి వాటిల్లో సీట్లు పొందని వారికి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు..

TS Eamcet 2023 Counselling: ఆగస్టు17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌.. మిగిలిపోయిన సీట్లు 19 వేలు
TS Eamcet 2023 Counselling
Srilakshmi C
|

Updated on: Aug 09, 2023 | 12:24 PM

Share

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశకు చేరుకుంది. బుధవారం (ఆగస్టు 9) కన్వినర్‌ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం 19 వేల సీట్లను వివిద బ్రాంచులకు కేటాయించాల్సి ఉంది. కన్వినర్‌ కోటా కింద 82,666 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు రిపోర్టు చేయకపోవడం వల్ల మిగిలిపోయిన 18 వేల సీట్లతో కలిపి మొత్తం 30,013 సీట్లను రెండో విడతలో కేటాయించారు. ఐతే రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. రెండో విడతలో సీట్లు పొందినా 7 వేల మంది వరకూ విద్యార్ధులు ఆయా కాలేజీల్లో చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 19 వేల వరకూ సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజాగా జరిగిన తుది విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే సీటు రద్దవుతుంది. తుది విడతలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరగనుంది.

జోసా కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కాబట్టి వాటిల్లో సీట్లు పొందని వారికి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేయాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పించు కోవాలి. అప్పటికే వేరే కాలేజీలో సీటు వచ్చి ఉంటే అక్కడ టీసీ, సర్టిఫికెట్లను తీసుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఈ నెల 25లోగా రిపోర్టు చేయాలి.

ఇక యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ప్రత్యేక కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలోగా యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాలను ప్రైవేటు కాలేజీలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది కాబట్టి వీటిల్లో 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. మిగిలిన15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ సిఫార్సులకు కేటాయిస్తారు. జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?