Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: 9ఏళ్లలో ఎంతో చేశారు.. మళ్లీ మోడీనే ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్

Amit Shah: నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారు.. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.. ప్రతిపక్షాలవి లేనిపోని ఆరోపణలే.. అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా అమిత్ షా రెండో రోజు లోక్ సభలో ప్రసంగించారు. 9 ఏళ్లలో ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను 9 స్థానం నుంచి 5 వ స్థానంలోకి తీసుకువచ్చారంటూ అమిత్ షా పేర్కొన్నారు. […]

Amit Shah: 9ఏళ్లలో ఎంతో చేశారు.. మళ్లీ మోడీనే ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్
Amit Shah
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2023 | 6:35 PM

Amit Shah: నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారు.. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.. ప్రతిపక్షాలవి లేనిపోని ఆరోపణలే.. అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా అమిత్ షా రెండో రోజు లోక్ సభలో ప్రసంగించారు. 9 ఏళ్లలో ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను 9 స్థానం నుంచి 5 వ స్థానంలోకి తీసుకువచ్చారంటూ అమిత్ షా పేర్కొన్నారు. ఏడు కీలక రంగాల్లో ప్రధాని మోడీ బలమైన పునాదులు వేశారంటూ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సభలో 27 అవిశ్వాస తీర్మానాలు, 11 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. ఇందులో కేబినెట్‌పైనా, మంత్రివర్గంపైనా ప్రజలకు విశ్వాసం లేదంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఇది ప్రజల్లో భ్రమను వ్యాపింపజేయడానికేనంటూ హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 60 కోట్ల మంది పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశలు కల్పించారు. దేశంలో విశ్వసించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనంటూ పేర్కొన్నారు. ఈ దేశానికి 30 ఏళ్ల తర్వాత రెండుసార్లు సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అత్యంత నమ్మకమైన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీయే. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 24 గంటలలో 17 గంటలు పని చేస్తున్నారంటూ అమిత్ షా పేర్కొన్నారు.

గత తొమ్మిదేళ్లలో ప్రధాని కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారని అమిత్ షా తెలిపారు. బంధుప్రీతి, అవినీతిని ఖండించారు. 2014కి ముందు, అవినీతి లేదా బంధుప్రీతి, అభిమానం ఓటములను.. విజయాలను ప్రభావితం చేశాయి. ప్రజల అభివృద్ధే ద్యేయంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. మరోసారి క్విట్‌ ఇండియా నినాదాన్ని తీసుకుచ్చారన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా సమాధానమిస్తూ.. 1993 జూలైలో నరసింహారావు ప్రభుత్వం ఉందని చెప్పారు. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అయితే, ఇది చాలా మందికి జైలు శిక్షకు దారితీసింది. ఎందుకంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకు డబ్బులు ఇచ్చి ఆమోదించిందంటూ ఫైర్ అయ్యారు.

1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. అయితే యూపీఏ లాగా ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయాం. అయితే, అవినీతికి పాల్పడి ప్రభుత్వాన్ని కాపాడాలని అనుకోలేదంటూ అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై మాట్లాడుతూ విపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..