Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Office బీజేపీ కార్యాలయంలో ప్రతిష్ఠించిన భరత మాత విగ్రహం.. తొలగించిన అధికారులు, పోలీసులు

తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నమలై మరో రెండు మూడు రోజుల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు భరత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. సోమవారం రోజున ఉదయం బీజేపీ జిల్లా హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలోని ప్రవేశద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ విషయంపై కొంతంది పోలీసులు, అధికారులను ఫిర్యాదు చేశారు.

BJP Office  బీజేపీ కార్యాలయంలో ప్రతిష్ఠించిన భరత మాత విగ్రహం.. తొలగించిన అధికారులు, పోలీసులు
Bharat Mata Statue
Follow us
Aravind B

|

Updated on: Aug 09, 2023 | 4:29 PM

భారతీయ జనతా పార్టీ ఎక్కువగా చేసే నినాదం భారత్ ‌మాతా కీ జై. తమిళనాడులోని విరుదు‎నగర్ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో భరత మాతను తాజాగా ప్రతిష్ఠించారు. అయితే అక్కడికి సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ భరత మాత విగ్రహాన్ని ఆ పార్టీ ఆఫీస్ నుంచి తొలగించారు. అనుమతి లేకుండా బీజేపీ నేతలు తమ కార్యాలయంలో భరత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అధికారులు ఆరోపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవలే అక్కడ బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చిన ఆయాన పార్టీ ఆఫీస్‌ను ఆవిష్కరించారు. అయితే ఇప్పటికీ అందులో పనులు పూర్తి అవ్వలేదు. కొన్ని పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక బీజేపీ నేతలు భరత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠాంచాలని నిర్ణయించారు.

మరో విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నమలై చేపట్టిన పాదయాత్ర మరో రెండు మూడు రోజుల్లో విరుదునగర్ జిల్లాకు ప్రవేశించనుంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు భరత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. సోమవారం రోజున ఉదయం బీజేపీ జిల్లా హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలోని ప్రవేశద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ విషయంపై కొంతంది పోలీసులు, అధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నమే రెవెన్యూ అధికారులు, పోలీసులు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. విగ్రహం ఏర్పాటు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని చెప్పారు. వెంటనే భరత మాత విగ్రహాన్ని తొలగించాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. కానీ ఇందుకు బీజేపీ శ్రేణులు ఒప్పుకోలేదు. ఈ స్థలానికి అన్ని డ్యాకుమెంట్లు ఉన్నాయని.. ఇది జిల్లా బీజేపీ కార్యాలయానికి సంబధించిందని అధికారులతో వాదించారు. అలాగే ఇది పార్టీ అంతర్గత వ్యవహారని చెప్పారు. మేము విగ్రహాన్ని తీసివేయంటూ తేల్చి చెప్పారు. కానీ అధికారులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. చివరికి వాళ్లే బలవంతంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేశారు.

దీంతో పోలీసులు, అధికారుల చర్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై ఖండించారు. డీఎంకే ప్రభుత్వ పాలనలో.. సొంత పార్టీ స్థలంలోనే భరత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునే హక్కు లేకుండా పోయిందనని ఆరోపించారు. తాము చేపట్టిన ఎన్ మక్కాల్ యాత్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు చూపిస్తోందని డీఎంకే మంత్రులు భయపడిపోయారని.. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..