Google: ఇకనుంచి భూకంప అప్రమత్త సందేశాలు ఫోన్‌లోనే.. గూగుల్ కీలక ప్రకటన
ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ కీలక సమాచారాన్ని అందించింది. ఇకనుంచి భూకంప అప్రమత్త సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్ బుధవారం ప్రకటన చేసింది. అయితే ఇది ఆండ్రాయిడ్ వాడుతున్నవారికి ముందస్తుగానే భూకంపాల సందేశాలను పంపిస్తుంది. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), నేషనల్ సిస్మాలజీ సెంటర్ (ఎన్‌ఎస్‌సీ)తో కలిసి ఈ సందేశాలను పంపించనున్నాయి.

ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ కీలక సమాచారాన్ని అందించింది. ఇకనుంచి భూకంప అప్రమత్త సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్ బుధవారం ప్రకటన చేసింది. అయితే ఇది ఆండ్రాయిడ్ వాడుతున్నవారికి ముందస్తుగానే భూకంపాల సందేశాలను పంపిస్తుంది. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), నేషనల్ సిస్మాలజీ సెంటర్ (ఎన్‌ఎస్‌సీ)తో కలిసి ఈ సందేశాలను పంపించనున్నాయి. ఇటువంటి వ్యవస్థను గూగుల్ ఇప్పటికే పలు దేశాల్లో అమలు చేస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ భూకంప అప్రమత్త సందేశాలు భారతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఉండేటటువంటి యాక్సెలరోమీటర్.. మినీ సిస్మోమీటర్లుగా పనిచేస్తాయని గూగుల్ తెలిపింది. అలాగే ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టినటువంటి సమయంలో భూప్రకంపనలను ఇవి ముందస్తుగానే గుర్తిస్తాయని పేర్కొంది.
అలాగే ఏకకాలంలో చాలావరకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఇలా స్పందించినప్పుడు తమ కంపెనీ సర్వర్ ఈ సంకేతాలను మొత్తం సేకరిస్తాయని.. అలాగే ఆ ప్రదేశంలో భూకంపం వచ్చిందా లేదా అనే విషయాలని తనిఖీ చేస్తాయని తెలిపింది. అయితే ఈ క్రమంలోనే ప్రకంపనల తీవ్రత, భూకంప కేంద్రాన్ని కూడా అంచనావేస్తాయని.. ఆ తర్వాత వెంటనే వినియోగదారులకు అలర్ట్‌లు వెళ్లిపోతాయని చెప్పింది. అలాగే ఇంటర్నెట్‌సంకేతాలు కాంతివేగంతో ప్రయాణిస్తాయని.. భూకంప షాక్ తరంగాల కంటే కూడా ఇవి చాలా వేగంగా ప్రయాణం చేస్తాయని పేర్కొంది. దీనివల్ల ఆ తరంగాల కంటే ముందే అలర్ట్‌లు వినియోగదారుల ఫోన్లకు చేరతాయని గూగుల్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మరికొన్ని రోజుల్లోనే ఈ అలర్ట్‌ల వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ 5 అలాగే దానిపై ఉండే వెర్షన్లన్నింటికీ ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ అలర్ట్‌లను అందుకోవాలంటే మాత్రం వినియోగదారుల ఫోన్లు తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ అలర్ట్‌లను ఆఫ్ చేసుకొనేందుకు ఓ ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు ఈ వ్యవస్థలన్ని సమీపంలోని ఉన్నటువంటి భూకంపాలకు సంబంధించిన సమాచారం కూడా చేరవేస్తాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోని అనేక చోట్ల భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే జనావాసాలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చినట్లైతే.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. చాలావరకు ఆస్తి నష్టం జరుగుతుంది. భూకంపాలు ఎప్పుడు వస్తాయో జనాలు ఊహించలేరు. అకస్మాత్తుగా రావడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన అలర్ట్ సిస్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




