విమానంలో పైలట్ కోసం ఎదురుచూసిన ప్రయాణికులు.. చివరికి
ఈ మధ్య కాలంలో విమానాలు ఆలస్యంగా టేకాఫ్ అవుతున్నటువంటి ఘటనలు చాలాసార్లు చోటు చేసుకుంటున్నాయి. బాంబు ఉందని కొందరు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం, ఇంజిన్‌లో సాంకేతిక లోపం జరగడం, అలాగే ప్రయాణికుల మధ్య అనుచిత ప్రవర్తన వంటి కారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనివల్ల విమానాలు టేకాఫ్ అవ్వడం ఆలస్యం అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో విమానాలు ఆలస్యంగా టేకాఫ్ అవుతున్నటువంటి ఘటనలు చాలాసార్లు చోటు చేసుకుంటున్నాయి. బాంబు ఉందని కొందరు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం, ఇంజిన్‌లో సాంకేతిక లోపం జరగడం, అలాగే ప్రయాణికుల మధ్య అనుచిత ప్రవర్తన వంటి కారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనివల్ల విమానాలు టేకాఫ్ అవ్వడం ఆలస్యం అవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం భిన్నంగా జరిగింది. ఇక్కడ ఎవరూ ఫోన్ చేసి బాంబు ఉందని బెదరించలేదు.. ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదు.. కేవలం విమానాన్ని నడిపే పైలట్ ఆలస్యంగా రావడం వల్ల ఆ విమానం లేటుగా బయల్దేరింది. ఈ ఘటన సోమవారం రోజున ఢిల్లీ – పుణె ఎయిరిండియా విమానంలో జరిగింది. అయితే అసలు ఏం జరిగింది. ఆ పైలట్ ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలిలు ఇలా ఉన్నాయి.
అయితే ఎయిరిండియాకు చెందినటువంటి AI853 విమానం సోమవారం రాత్రికి 7:10 PMకి ఢిల్లీ నుంచి బయల్దేరింది. అయితే ఆ విమానం 9:10 PMకి పుణె చేరుకోవాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారంగానే విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్‌లు జారీ చేయడం వల్ల ప్రయాణికులందరూ విమానంలో కూర్చుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. ప్రయాణికులు అలా ఎంతసేపు కూర్చున్నప్పటికీ కూడా.. విమానం టేకాఫ్ కాలేదు. దీంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కేబిన్ సిబ్బందిని ప్రశ్నించడంతో.. పైలట్ రాలేదనే విషయం చెప్పారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఎట్టకేలకు రెండు గంటలు ఆలస్యంగా పైలట్ రావడం వల్ల విమానం రాత్రికి 10:35 PM గంటలకి బయల్దేరి.. 11:15 PM గంటలకి పుణెకు చేరుకుంది. అయితే ఆ సమయంలో విమానంలోని దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన గురించి కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఎయిరిండియాకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎయిరిండియా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా.. మరోవైపు బుధవారం మరో ఎయిరిండియా విమానం కూడా ఆలస్యంగా బయలుదేరింది. కేరళలోని కోయ్‌కోడ్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్నటువంటి ఎయిరిండియా విమానం ఉదయం 9:53 AMకి టేకాఫ్ అయింది. అయితే కొద్దిసేపటికే ఫైర్ అలారమ్ మోగింది. దీంతో కన్నూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆ విమానాన్ని సిబ్బంది తనిఖీ చేశారు. సాంకేతిక లోపం వల్ల అలారమ్ మోగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసిట్లు ఎయిరిండియా పేర్కొంది. అలాగే ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి కూడా చింతిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




