Telangana Congress: అధికారం కోసం మమ్మల్ని మోసం చేస్తారా.. కాంగ్రెస్ పార్టీలో మరో ఆందోళన

Telangana Politics: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనుకుంటుంది. అందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. పార్టీ కోసం ఇంత కాలంశ్రమించిన నేతలను కాదని... పారాచూట్ నేతలకు సైతం టికెట్లు ఇచ్చేస్తుంది. దీంతో తామేమై పోవాల‌ని ఓరిజిన‌ల్ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Telangana Congress: అధికారం కోసం మమ్మల్ని మోసం చేస్తారా.. కాంగ్రెస్ పార్టీలో మరో ఆందోళన
Telangana Congress
Follow us
TV9 Telugu

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 27, 2023 | 1:49 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ ఇచ్చి కూడా పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ తాజా పరిస్థితులను చక్కగా వినియోగించుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే గెలవగలిగే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని అనుకుంటుంది. రాజకీయ, ఆర్థిక నేపథ్యం ఉన్న బడా నేతల వేటలో పడింది కాంగ్రెస్ పార్టీ. తన సర్వే టీం లతో 119 నియోజకవర్గాలలోని పేరున్న, బలమైన నేపథ్యం ఉన్న, గెలవగలిగే కెపాసిటీ ఉన్న నేతలను గుర్తిస్తోంది. అందులో బాగంగా పొరుగు పార్టీ నుంచి వ‌స్తున్న నేత‌ల‌కు టికెట్లు ఆఫ‌ర్ చేస్తుంది.

టికెట్ల హ‌మీతో ప‌ది మంది బీజేపీ మాజీ ఎంపీల‌కు గాలం వేస్తుంది హ‌స్తం పార్టీ. ఇంతవరకు బాగానే ఉన్నా ఇన్నాళ్లు అనేక ఇబ్బందులకు, ఒడిదొడుకులకు లకు ఎదురొడ్డి నిలబడి పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టేస్తున్నారు.

పారాచూట్ నేతల కోసం బలి..

పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఎన్నో వ్య‌య‌ప్ర‌యాసాల‌కోర్చి కార్యక్రమాలు నిర్వహాస్తూ వస్తున్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వివిధ రూపాలలో ఇన్నాళ్లు కష్టపడ్డ వీరిని పారాచూట్ నేతల కోసం బలి చేస్తున్నారనే నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎవరితో అయితే ఇబ్బందులు పడ్డారో అదే నేతలు వచ్చి పార్టీలో చేరి టికెట్లను త‌న్నుకు పోవ‌డాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

అండగా ఉన్న నెతలకి టికెట్ రాకపోతే..

ఇప్పటిదాకా తమకి అండగా ఉన్న నెతలకి టికెట్ రాకపోతే రాష్ట్ర నాయకత్వం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తయారైందని.. స్వయంగా రాష్ట్ర, జాతీయ నేతలే ఈ విధంగా ప్రోత్సహించడం కాంగ్రెస్ కి ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లినందున కాంగ్రెస్ సొంతంగా గెల‌వ‌గ‌లిగే అవ‌కాశాలున్నా ఈ సందర్భంలో.. బీఆర్ఎస్, బిజెపి నేతలను డైరెక్ట్ గా తీసుకొచ్చి టికెట్లు కేటాయించడం వెనుక మతలబెంటని ప్రశ్నిస్తున్నారు.

నిన్న మొన్నటిదాకా టికెట్ నీకే అని చెప్పి ఇప్పుడు మాత్రం టికెట్ ఇవ్వ‌లేక‌పోతున్నాం..స‌ర్దుకు పోవాల‌ని పార్టీ నేత‌లు రాయ‌బారాలు న‌డ‌ప‌డాన్ని ఆశావాహులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డా ప‌రాయి పార్టీ నుంచి వ‌స్తున్న‌ పారాచూట్ నేతలకే టికెట్లు ఇస్తారా అంటు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా అయితే త‌మ దారి తాము చూసుకుంటామ‌ని పలువురు నేత‌లు హెచ్చ‌రిస్తున్న‌నేప‌థ్యంలో..కాంగ్రెస్ లో టికెట్ల ప్ర‌క‌ట‌న గంద‌రగోళానికి దారి తీసే అవ‌కాశాలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి