AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Warangal: నిట్‌ వరంగల్‌లో ఆ పోస్టుల నియమాకాలు రద్దు చేస్తూ బీవోజీ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. ఇప్పటికే టీఎస్పీయస్సీ చేతగాని తనంతో రాష్ట్ర నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రెండో సారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా రద్దయ్యింది. పేపర్‌ లీకులు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేకపోతుందనే రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నియామక పరీక్ష కూడా రద్దయ్యింది. వరంగల్‌లోని ఎన్‌ఐటీలో 2021లో 23 గ్రూప్‌ డి నియామకాలు..

NIT Warangal: నిట్‌ వరంగల్‌లో ఆ పోస్టుల నియమాకాలు రద్దు చేస్తూ బీవోజీ ఉత్తర్వులు జారీ
NIT Warangal
Srilakshmi C
|

Updated on: Sep 27, 2023 | 2:07 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27: తెలంగాణ రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. ఇప్పటికే టీఎస్పీయస్సీ చేతగాని తనంతో రాష్ట్ర నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రెండో సారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా రద్దయ్యింది. పేపర్‌ లీకులు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేకపోతుందనే రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నియామక పరీక్ష కూడా రద్దయ్యింది. వరంగల్‌లోని ఎన్‌ఐటీలో 2021లో 23 గ్రూప్‌ డి నియామకాలు చేపట్టింది. ఇందుకు సంబంధించి అపాయింట్మెంట్‌ లెటర్లు కూడా జారీ చేసింది. కానీ ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఇవ్వలేదని బీవోజీ అభిప్రాయపడింది.

కనీసం పత్రిక ప్రకటన కూడా ఇవ్వకుండా భర్తీ చేయడం సరికాదని 62వ నిట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) ఎన్‌ఐటీ చర్యను తప్పుపట్టింది. ఈ పోస్టులకు 2021లో నోటిఫికేషన్‌ లేకుండానే నియామక పరీక్ష జరిగడం వివాదంగా మారింది. ఎంపికైన అభ్యర్ధులకు ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా పీఎం రోజ్‌గార్‌ మేళా ‘మిషన్‌ మోడ్‌’లో నియామక ఉత్తర్వులు కూడా ఇప్పించారు. అయితే ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని గుర్తించిన బీవోజీ సెప్టెంబ‌రు 26న‌ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నియమంచిన 23 మంది తరహాలోనే గతంలో 9 మందిని గ్రూప్‌ 4 పోస్టులకు నిట్ వరంగల్‌ యాజమాన్యం నియమించినట్లు బీవోజీ దర్యాప్తులో తేలింది. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. గతంలోనూ పలు పోస్టుల భర్తీలో పారదర్శకత లోపించిందని పలువురు ఫిర్యాదులు చేశారు.

టీఎస్‌ఈఆర్‌సీలో కార్యదర్శి పోస్టుకు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)లో ఒప్పంద లేదా డిప్యుటేషన్‌ ప్రాతిపదికన కార్యదర్శి పోస్టు నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీలో ఉత్తీర్ణత పాటు 20 ఏళ్ల ఇంజినీరింగ్‌ లేదా 15 ఏళ్ల అడ్మిన్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు 2023, అక్టోబర్‌ 10 తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నింపిన దరఖాస్తులను కమిషన్‌ కార్యదర్శి, డోర్‌ నెంబర్‌ 11-4-660, 5వ ఫ్లోర్‌, సింగరేణిభవన్‌, రెడ్‌హిల్స్‌, హైదరాబాద్‌- 500004 అడ్రస్‌లో స్వయంగా లేదా ఫోస్ట్ ద్వారా అందజేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.