చిద్దూను అరెస్ట్ చేశారా ? గుడ్ న్యూస్.. ఇంద్రాణి ముఖర్జీ

చిద్దూను అరెస్ట్ చేశారా ? గుడ్ న్యూస్.. ఇంద్రాణి ముఖర్జీ

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడం గుడ్ న్యూస్ అని ఈ మీడియా మాజీ బాస్ ఇంద్రాణి ముఖర్జీ అభివర్ణించింది.. ముంబైలోని సెషన్స్ కోర్టు వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇది మంచి వార్త అని పేర్కొంది. ఈ కేసులో చిదంబరాన్ని సీబీఐ ఈ నెల 21 న అరెస్టు చేసింది. కాగా-ఇదే కేసులో ఇంద్రాణి అప్రూవర్ గా మారిన సంగతి విదితమే. ఆమెతో […]

Anil kumar poka

|

Aug 29, 2019 | 2:39 PM

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడం గుడ్ న్యూస్ అని ఈ మీడియా మాజీ బాస్ ఇంద్రాణి ముఖర్జీ అభివర్ణించింది.. ముంబైలోని సెషన్స్ కోర్టు వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇది మంచి వార్త అని పేర్కొంది. ఈ కేసులో చిదంబరాన్ని సీబీఐ ఈ నెల 21 న అరెస్టు చేసింది. కాగా-ఇదే కేసులో ఇంద్రాణి అప్రూవర్ గా మారిన సంగతి విదితమే. ఆమెతో ఆటు నిందితుడైన ఈమె భర్త పీటర్ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. (తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి జైలు శిక్ష అనుభవిస్తోంది). తనకు చిదంబరం, ఆయన కొడుకు కార్తీ బాగా తెలుసునని, లోగడ ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ కోసం పది లక్షల డాలర్లను ముడుపులుగా చెల్లించాలని కార్తీ చేసిన డిమాండును తాను, పీటర్ అంగీకరించామని ఈడీ ఇంటరాగేషన్ సందర్భంగా ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించింది. ఆ డీల్ లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు పేర్కొంది. 2018 మార్చి నెలలో తమకు ఈ డీల్ కుదిరిన విషయాన్ని ఆమె వివరించింది. ఈ కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సీబీఐ అరెస్టు చేయగా.. ఆ తరువాత ఆయనకు బెయిలు లభించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu