‘కశ్మీర్‌’పై మాజీ క్రికెటర్ల ట్వీట్ల వార్

జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాక్ అధికారుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇక పాక్‌కు చెందిన అధికారులైతే వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయంలో భారత్‌పై తమ అక్కసును ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ అంశంపై ఓ ట్వీట్ చేశారు. ప్రధాని పిలుపు మేరకు ఈ వారం కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా అరగంట పాటు తాను మజర్ ఇ ఖైద్(మహ్మద్ అలీ జిన్నా సమాధి) వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని.. […]

‘కశ్మీర్‌’పై మాజీ క్రికెటర్ల ట్వీట్ల వార్
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 2:16 PM

జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాక్ అధికారుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇక పాక్‌కు చెందిన అధికారులైతే వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయంలో భారత్‌పై తమ అక్కసును ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ అంశంపై ఓ ట్వీట్ చేశారు. ప్రధాని పిలుపు మేరకు ఈ వారం కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా అరగంట పాటు తాను మజర్ ఇ ఖైద్(మహ్మద్ అలీ జిన్నా సమాధి) వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని.. సెప్టెంబర్ 6న షాహిద్ ఇంటిని సందర్శిస్తానని తెలిపారు. అలాగే త్వరలో వాస్తవాదీన రేఖను కూడా విజిట్ చేస్తానని వెల్లడించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారగా.. దీనిపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చారు.

‘‘కొంతమంది ఎప్పటికీ ఎదగలేరు. వారు క్రికెట్ ఆడుతారు కానీ ఆలోచించలేరు. వారి మెదడు కూడా ఎప్పటికీ మందకొడిగానే ఉంటుంది’’ అని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.