ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలో శుక్రవారం (నవంబర్ 28) పర్యటించారు. ఈ సందర్భంగా గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన "సార్ధ పంచశతమానోత్సవ్" వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలో శుక్రవారం (నవంబర్ 28) పర్యటించారు. ఈ సందర్భంగా గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన “సార్ధ పంచశతమానోత్సవ్” వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను విడుదల చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆశ్రమంలోని సన్యాసుల నుండి ఆశీస్సులు పొందారు. దాని సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. ఈ మఠం చాలా కాలంగా గోవా పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కాగా, 77 అడుగుల ఎత్తైన ఈ రాముడి విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ వి.ఎస్. సుతార్ రూపొందించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా ఆయన రూపొందించారు. శ్రీరామ విగ్రహంతో పాటు, గోవాలో రామాయణ థీమ్ పార్క్, రామ్ మ్యూజియం కూడా నిర్మిస్తున్నారు. అంతకుముందు, ప్రధానమంత్రి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించారు. అక్కడ ఆయన శ్రీకృష్ణ మఠంలో ప్రార్థనలు చేశారు. సుమారు 100,000 మందితో కలిసి ప్రధాని మోదీ లక్ష్మీకాంత గీతా పారాయణంలో కూడా పాల్గొన్నారు.
Glad to be in Udupi, a place associated with devotion, learning and tradition. The welcome I’ve received in Udupi will always be etched in my memory. Grateful to the people. pic.twitter.com/8cMzI9VenP
— Narendra Modi (@narendramodi) November 28, 2025
గోవాను సాధారణంగా ఎంజాయ్‌మెంట్‌సు గమ్యస్థానంగా చూస్తారు, కానీ ఇది చాలా ప్రాంతీయ, సాంస్కృతికంగా ముఖ్యమైన ప్రదేశం అని ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనిని హైలైట్ చేయడం దాని ఇమేజ్‌ను మార్చడానికి చాలా అవసరం. ఆసియాలోనే ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి విగ్రహం లేదు. మన సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మనలో చాలా మంది అయోధ్యను సందర్శించలేకపోయారు. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుండి కూడా ప్రజలు వచ్చారు.
#WATCH | Goa | Prime Minister Narendra Modi unveiled a 77-foot statue of Lord Ram made up of bronze at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math.
The Prime Minister is visiting the math on the occasion of ‘Sardha Panchashatamanotsava’, the 550th-year celebration of the… pic.twitter.com/LgSQEvASbc
— ANI (@ANI) November 28, 2025
అంతకుముందు, భారతదేశం నలుమూలల నుండి 15,000 మందికి పైగా భక్తులు ఇక్కడకు వచ్చారని ఉత్సవ కమిటీ తెలిపింది. 11 రోజుల పాటు జరిగే మఠం 550వ వార్షికోత్సవ వేడుకలకు 1.2 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని వెల్లడించారు.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రముఖ సింగర్స్ శంకర్ మహదేవన్, అనుప్ జలోటా వంటి ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే, శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ మఠం మొదటి గౌడ సారస్వత బ్రాహ్మణ వైష్ణవ మఠం. ఇది 13వ శతాబ్దం ADలో జగద్గురు మధ్వాచార్య స్థాపించిన ద్వైత శాఖను అనుసరిస్తుంది. ఈ మఠం ప్రధాన కార్యాలయం దక్షిణ గోవాలోని పార్తగలి అనే చిన్న పట్టణంలోని కుషావతి నది ఒడ్డున ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




