Go First: దివాళా తీసిన ‘గో ఫస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన విమానాలు..

Go First Airline: చూస్తుండగానే మరొక భారతీయ విమానయాన సంస్థ దివాళా తీసింది. నగదు కొరత కారణంగా ఎయిర్‌లైన్ గో ఫస్ట్ దివాళా ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రాట్‌ అండ్‌..

Go First: దివాళా తీసిన ‘గో ఫస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన విమానాలు..
Go First Airline
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 8:41 AM

Go First Airline: చూస్తుండగానే మరొక భారతీయ విమానయాన సంస్థ దివాళా తీసింది. నగదు కొరత కారణంగా ఎయిర్‌లైన్ గో ఫస్ట్ దివాళా ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రాట్‌ అండ్‌ విట్నీసంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్‌ కోనా తెలిపారు. అలాగే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో గోఫస్ట్‌ విమాన సంస్థకు చెందిన 55 విమానాల్లో 28 విమానాలు నిలిచిపోయాయి. మొత్తంగా సగానికిపైగా విమానాలు ఇంజిన్లలో లోపం కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం సకాలంలో అమెరికాకు చెందిన పీడబ్ల్యూ సంస్థ ఇంజిన్లను రిపేర్‌ చేయకపోవడం, తగిన విడిభాగాలను సరఫరా చేయకపోవడమే ఇందుకు కారణమని గోఫస్ట్ పేర్కొంది.

కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పీడబ్ల్యూ స్పేర్ లీజు ఇంజిన్‌లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ పరసిస్థితి ప్రశ్నార్థకం మారింది. మరోవైపు గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?