AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: ప్రధాని మోడీ దౌత్య నీతి కారణంగానే ‘జీ-20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

జీ20 సమావేశాలతో ప్రపంచం దృష్టి మరొకసారి భారత్‌పై పడిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం కల్పించేందుకు మోడీ చేసిన కృషి అందరి ప్రశంసలు అందుకుంటుందన్నారు. ' ప్రపంచ ప్రభావవంతమైన నాయకులందరూ ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో.. యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉంది. 'వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో మనం నిర్వహిస్తున్న ఈ సమావేశాల ప్రారంభ సెషన్‌లోనే..

G20 Summit: ప్రధాని మోడీ దౌత్య నీతి కారణంగానే 'జీ-20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌'.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
PM Narendra Modi. Kishan Reddy
Basha Shek
|

Updated on: Sep 09, 2023 | 9:05 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. మొత్తం రెండు రోజుల సదస్సు శనివారం (సెప్టెంబర్‌ 9) ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని సువిశాలమైన భారత్ మండపంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , యూకే ప్రధాని రిషి సునక్‌తో సహా విదేశీ ప్రముఖులు, ప్రతినిధులు, ప్రపంచ నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సదస్సుకు విచ్చేసిన అతిరథమహారథులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. కాగా జీ20 సమావేశాలతో ప్రపంచం దృష్టి మరొకసారి భారత్‌పై పడిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం కల్పించేందుకు మోడీ చేసిన కృషి అందరి ప్రశంసలు అందుకుంటుందన్నారు. ‘ ప్రపంచ ప్రభావవంతమైన నాయకులందరూ ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో.. యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉంది. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో మనం నిర్వహిస్తున్న ఈ సమావేశాల ప్రారంభ సెషన్‌లోనే 55 దేశాల కూటమి అయిన ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం కల్పించేందుకు చేసిన కృషి ప్రశంసలు అందుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దౌత్యనీతి, ప్రపంచాధినేతల్లో ఆయనకున్న ప్రత్యేక గౌరవం కారణంగా.. ‘జీ-20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

అలాంటి నేతలు దేశానికి అవసరం లేదు..

ఇదే సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు కిషన్‌ రెడ్డి. ‘రాహుల్ గాంధీ విదేశాల్లో కూర్చుని భారతదేశ సామర్థ్యంపై, భారతీయులపై అర్థరహితమైన, అసంబద్ధమైన విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీపై ఆయనకు, ఆయన కుటుంబానికి ఉన్న కోపాన్ని.. క్రమంగా దేశం పట్ల ద్వేషంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, వారి మేధోవర్గానికి భారతదేశ ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. భారతదేశానికి.. తన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే ఓ బాధ్యతాయుతమైన విపక్షం కావాలి. అంతే కానీ.. తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశ ప్రతిష్టను దిగజార్చే స్వార్థపూరిత రాజకీయ నాయకులు మన దేశానికి ఎంతమాత్రం అవసరం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

జీ 20 సమావేశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..