Air India Express: ఎయిర్-ఇండియా విమానంలో హైడ్రాలిక్‌ వైఫల్యం.. ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌.. ! ఎక్కడంటే..

శుక్రవారం ఉదయం 182 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్-ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానం కాలికట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయ్యే సమయంలో విమానం రన్‌వేను ఢీ కొట్టింది. దీం

Air India Express: ఎయిర్-ఇండియా విమానంలో హైడ్రాలిక్‌ వైఫల్యం.. ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌.. ! ఎక్కడంటే..
Air India
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 25, 2023 | 8:15 AM

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. కోజికోడ్‌ లోని కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించారు. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కాలికట్-దమ్మాం విమానాన్ని రాష్ట్ర రాజధానికి మళ్లించడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 182 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్-ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానం కాలికట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయ్యే సమయంలో విమానం రన్‌వేను ఢీ కొట్టింది. దీంతో హైడ్రాలిక్‌ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే విమానాన్ని తిరువనంతపురంకు మళ్లించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్‌ చేసినట్టుగా వెల్లడించారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణంతోనే తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..