ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బస్సులను వేగంగా ఢీ కొట్టిన లారీ.. 12 మంది దుర్మరణం..
మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. మూడు బస్సులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల..
మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. మూడు బస్సులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా నిర్వహించిన ర్యాలీ కోసం బస్సుల్లో వెళ్లిన ప్రజలు.. తిరిగి వస్తుండగా సిద్ధి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. లారీ వేగంగా ఢీ కొట్టడంతో మూడు బస్సులు బోల్తా పడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు విషయాన్ని చెప్పి.. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్కతం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున కూడా మంజూరు చేసినట్లు సీఎం శివరాజ్ ప్రకటించారు.
మరోవైపు.. మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. సిద్ధి లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
सीधी (म.प्र) में हुआ सड़क हादसा अत्यंत दुःखद है। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। प्रशासन द्वारा घायलों को उपचार उपलब्ध कराया जा रहा है। घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ।
— Amit Shah (@AmitShah) February 24, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..