AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menu Card: రసగుల్లా కిలో రూ. 14, సమోసా 50 పైసలు.. ఈ మెనూ కార్డ్ చూస్తే లొట్టలేయాల్సిందే.. కానీ కండిషన్స్ అప్లై..

ఈ మెనూ కార్డ్‌ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరీ తక్కువలో అవన్నీ దొరుకుతున్నాయంటే నమ్మలేకపోతున్నామంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

Menu Card: రసగుల్లా కిలో రూ. 14, సమోసా 50 పైసలు.. ఈ మెనూ కార్డ్ చూస్తే లొట్టలేయాల్సిందే.. కానీ కండిషన్స్ అప్లై..
Sweets
Jyothi Gadda
|

Updated on: Feb 25, 2023 | 7:43 AM

Share

ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. పెట్రోలు-డీజిల్ ధరలు భగ్గమంటున్నాయి. ఆహారం, ఇతర పానీయాల రేట్లు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అయితే ఒకప్పుడు ఇవన్నీ చాలా చౌకగా దొరికేవి. అలాంటి మెనూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఒకప్పుడు మిఠాయిలు, సమోసాల ధరలు చాలా తక్కువగా ఉండేవని స్పష్టంగా తెలుస్తుంది. ఈ మెనూ కార్డ్‌ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరీ తక్కువలో అవన్నీ దొరికేవంటే నమ్మలేకపోతున్నామంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం రూ.30 నుంచి 40 వరకు లభించే రస్మలై సింగిల్‌ పీస్‌ ఒకప్పుడు కేవలం రూ.1కే లభించేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెనూ కార్డ్‌లో కనిపిస్తోంది. అదేవిధంగా ఈరోజుల్లో రూ.12-15కి లభించే ఒక్క సమోసా అప్పట్లో కేవలం 50 పైసలకే కొనుక్కుని తినేవాళ్లు ప్రజలు.

అదేవిధంగా ఈరోజుల్లో కిలో రూ.300-400కి లభించే గులాబ్ జామూన్ కేజీ రూ.14కే కొనుక్కుని కుటుంబమంతా తినేవారు. దాదాపు కిలో రూ.500-600 కి లభించే మోతీ చుర్ లడ్డూలు కూడా అప్పట్లో కిలో రూ.10కి మాత్రమే కొనుగోలు చేసేవారు. ఈ మెనూ కార్డ్ 1980 సంవత్సరం నాటిది. ప్రజలు మెనూ కార్డ్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు

ఇవి కూడా చదవండి

ఈ మెనూ కార్డ్‌పై ప్రజలు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక యువ ఇంటర్నెట్ వినియోగదారు ఇలా వ్రాశాడు..అంతకుముందు అన్ని వస్తువులు నిజంగా చౌకగా అందుబాటులో ఉండేవి. మరొక వినియోగదారు స్పందిస్తూ.. మునుపటి యుగం మళ్లీ తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు అది ఎంత సరదాగా ఉంటుందని కామెంట్‌ చేశాడు.. ఒక వ్యక్తి 1980లో తన జీతం రూ. 1000 కాగా, అది నేడు రూ. లక్షకు పెరిగింది. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం దానికంటే చాలా రెట్లు పెరిగిందని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..