Rahul Gandhi: రాహుల్ గాంధీకి విదేశీ పర్యటనల వివాదాలు కొత్తేమీ కాదు.. ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బ్రిటన్ పర్యటనలో ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటనకు ముందు ప్రభుత్వం...

Rahul Gandhi: రాహుల్ గాంధీకి విదేశీ పర్యటనల వివాదాలు కొత్తేమీ కాదు.. ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi
Follow us

|

Updated on: May 27, 2022 | 7:33 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బ్రిటన్ పర్యటనలో ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటనకు ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని కొందరు ఆరోపిస్తున్నారు. గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఎంపీలు విదేశీ పర్యటనలకు వెళితే కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని ఉదాహరించారు. రాహుల్ గాంధీ హాజరైన సమావేశంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝూ(Manoj Jha) పాల్గొన్న విషయాన్ని వివరించారు. ఆయన ముందస్తు అనుమతి తీసుకున్నారని వెల్లడించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ.. భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయన లాగా ఇప్పుడు రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల గురించి వివరాలేవీ చెప్పడం లేదని ఆరోపించారు. 2019 లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాహుల్ గాంధీ ప్రతి నెలా సగటున కనీసం ఐదు సార్లు విదేశాలకు వెళ్తారని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ 2015 నుంచి 2019 మధ్య రాహుల్ భారతదేశంలో 1,892 సార్లు, 247 సార్లు విదేశాలకు తెలియజేయకుండా పర్యటించారని షా అన్నారు. అయితే సమస్య ఏమిటంటే రాహుల్ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ వివాదాన్ని లేవనెత్తారని ఆరోపించారు. తాజాగా ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్నలిస్టు స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన వ్యక్తిగత పర్యటన అని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు, రాహుల్ యూకేలో ఉన్నారు.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ప్రసంగించడం, ప్రవాస భారతీయులతో మాట్లాడటం కోసం ఆయన యూకే లో పర్యటించాల్సి వచ్చింది. ఇది తన విదేశీ పర్యటనల మాదిరిగా రీఫ్రెష్, విశ్రాంతి తీసుకునేందుకు వ్యక్తిగత పర్యటన కాదని, అంతర్జాతీయ వేదికపై తన పార్టీ అభిప్రాయాలను తెలియజేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన విషయాన్ని చెప్పారు. విదేశాల్లోని హైకమీషన్లు, రాయబార కార్యాలయాల్లో ఉన్న భారతీయ అధికారులు అహంకారంగా మారారని ఆయన అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు.

ఇవి కూడా చదవండి

కేంబ్రిడ్జ్‌లో జరిగిన ‘ఇండియా ఎట్ 75’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఎడిట్ చేసిన క్లిప్ వైరల్‌గా మారింది. తన తండ్రి మరణం గురించి, అతను భారత సమాజంలో హింస, అహింసను ఎలా కుదించారు అనే ప్రశ్న అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పడం కోసం సమయం తీసుకోవాల్సి వచ్చింది. చాలాసేపు మౌనం వహించిన రాహుల్ సారీ(క్షమాపణ) చెప్పి సైలెంట్ అయిపోయారు. గతేడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన విదేశీ పర్యటనల గురించి చెప్పకపోవడం గమనార్హం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!