Shanti Bhushan: కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఖ్యాతి..
కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించిన ఆయన.. దిల్లీలో తుదిశ్వాస విడిచారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో రాజ్..
కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించిన ఆయన.. దిల్లీలో తుదిశ్వాస విడిచారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ తరఫున న్యాయవాదిగా శాంతిభూషణ్ వాదనలు వినిపించారు. అనేక కీలక అంశాలపై వాదనలు వినిపించిన ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన లాయర్ గా పేరు పొందారు. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 1925 నవంబర్ 11న శాంతి భూషణ్ జన్మించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలందించారు. కాంగ్రెస్(ఓ)లో క్రియాశీలంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. జులై 14, 1977 నుంచి 1980 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో 1977 నుంచి 1979 మధ్య న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులోనూ శాంతి భూషణ్ కీలకంగా వ్యవహరించారు.
కాగా.. మాజీ మంత్రి అస్తమయంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.