Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్‌ శెట్టార్‌.. బీజేపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం..

కర్నాటక బీజేపికి అసమ్మతి తలనొప్పిగా మారింది. మొన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడే రాజీనామా చేస్తే.. నిన్న మాజీ సీఎం జగదీష్‌ శెట్టార్‌ బీజేపీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశించారు శెట్టార్‌.

Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్‌ శెట్టార్‌.. బీజేపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం..
Jagadish Shettar
Follow us

|

Updated on: Apr 17, 2023 | 10:17 AM

కర్నాటక బీజేపికి అసమ్మతి తలనొప్పిగా మారింది. మొన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడే రాజీనామా చేస్తే.. నిన్న మాజీ సీఎం జగదీష్‌ శెట్టార్‌ బీజేపీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశించారు శెట్టార్‌. అయితే, బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్దాల పాటు బీజేపీకి సేవలు చేసినందుకు తనకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాబితాలో 54 మందికి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. పలువురు సీనియర్లకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మల్లిఖార్జున్ ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో భేటీ అయిన శెట్టార్‌.. హస్తం కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ వరుసగా నేతలు బీజేపీకి రాజీనామా చేస్తుండటంతో రాష్ట్రనాయకత్వం తలలు పట్టుకుంటోంది.

బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్‌ నాయకుడనైన నాకు టిక్కెట్‌ వస్తుందని అనుకున్నాను, కానీ నాకు రాదని తెలియగానే షాక్‌కు గురయ్యాను. ఎవరూ నాతో మాట్లాడలేదు, ఒప్పించే ప్రయత్నం చేయలేదు, ఏమి హామీ ఇవ్వలేదు. ఇంకా నాకు పదవి వస్తుందా’’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నిన్న బీజేపీని వీడి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామమంటూ పేర్కొన్నారు. బీజేపీ తనకు ప్రతి పదవి ఇచ్చిందని.. పార్టీ కార్యకర్తగా పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేశానని.. కానీ చివరకు ఇలా చేసిందంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..