‘ఇదేంబడ్జెట్ ? ఐసీయులో ఎకానమీ.’. చిదంబరం ఫైర్..
కేంద్రం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం నిప్పులు చెరిగారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించిపోయి.. ‘ఐసీయు ‘ లో ఉందని, పారిశ్రామిక రంగం కుదేలయిందని ఆయన విమర్శించారు. ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ‘ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ‘అచ్ఛే దిన్ ‘ అంటున్నారు. ప్రతిరంగం క్షీణ దశలో ఉంది.. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల కోత విధించారు.. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రంగం ఎలా […]
కేంద్రం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం నిప్పులు చెరిగారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించిపోయి..
‘ఐసీయు ‘ లో ఉందని, పారిశ్రామిక రంగం కుదేలయిందని ఆయన విమర్శించారు. ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ‘ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ‘అచ్ఛే దిన్ ‘ అంటున్నారు. ప్రతిరంగం క్షీణ దశలో ఉంది.. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల కోత విధించారు.. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రంగం ఎలా పుంజుకుంటుంది ‘ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడి 60 శాతం మంది జీవిస్తున్నారని, అలాంటిది వారిని మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్నారని చిదంబరం అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కేంద్ర బడ్జెట్ పై ప్రసంగించారు. ఏ ఒక్క అంశంలోనూ ప్రగతి కనిపించడంలేదని, పెద్ద నోట్ల రద్దు చారిత్రక తప్పిదమని ఆరోపించారు. నోట్ల రద్దు కారణంగా ఉపాధికల్పన అవకాశాలు దారుణంగా దెబ్బ తిన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్ధిక వృద్ది 8.2 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం అవగాహన చేసుకునే ప్రయత్నమైనా చేయడంలేదని విమర్శించారు.