union budget 2020-21 : కొత్త కోవిడ్ -19 సెస్‌ను కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టనుందా..?

కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎక్కువగా పడింది. బడ్జెట్‌ సమీపిస్తున్న వేళ సంపన్నులపై అదనంగా కొవిడ్‌ సెస్..

union budget 2020-21 : కొత్త కోవిడ్ -19 సెస్‌ను కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టనుందా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2021 | 5:15 PM

కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎక్కువగా పడింది. బడ్జెట్‌ సమీపిస్తున్న వేళ సంపన్నులపై అదనంగా కొవిడ్‌ సెస్‌ లేదా సర్‌చార్జీని విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. కోవిడ్ పరిస్థితి కారణంగా ఆర్ధికంగా దెబ్బ తిన్న తర్వాత దేశం తిరిగి వృద్ధి పథంలోకి రావాలని చూస్తున్నతరుణంలో 2021-22 సంవత్సరానికి కేంద్రం రాబోయే బడ్జెట్ ప్రకటనపైనే  అందరి దృష్టి ఉంది.

కోవిడ్  సమయంలో  కేంద్ర ప్రభుత్వం పైన వ్యయం ఎక్కువగా పడింది. పైగా ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి భారీగా ఖర్చు చేయాలని చూస్తుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, కరోనావైరస్ సెస్ లేదా సర్‌చార్జిని ప్రవేశపెట్టే ప్రణాళికపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, భారతదేశంలో అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి కోవిడ్ -19 సెస్ లేదా సర్‌చార్జీని ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తుందని సమాచారం. గత ఏడాది జీఎస్టీ వసూళ్ళు భారీగా తగ్గాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం రాబడులు పెంచుకునేందుకు మార్గాలను వెతుకుతుంది. ఈ క్రామంలోనే సంపన్నులపై అదనంగా కొవిడ్‌ సెస్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టాలని కూడా కేంద్రం యోచిస్తోందని సమాచారం

ఒకవేళ ప్రభుత్వం కొవిడ్‌ సెస్‌ను అమలు చేస్తే ప్రభుత్వ రాబడి పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర సెస్‌ వసూళ్లను రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కొవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఇలాంటి తరుణంలో కొత్త పన్నులు విధించవద్దని భారత పరిశ్రమ ఇప్పటికే ప్రభుత్వానికి సూచనలు చేసింది. అయితే అంతకుముందు, నితి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ కనీసం 30 కోట్ల మందికి టీకా ఖర్చులను కేంద్రం భరిస్తుందని ధృవీకరించారు. జనవరి 16 న దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ధృవీకరించింది. అలాగే, పంపిణీ, శిక్షణ మరియు లాజిస్టిక్స్ కోసం కేంద్రం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంది.