రైతుల ఆందోళనలో ఖలిస్తానీలు, సుప్రీంకోర్టులో ప్రస్తావించిన కేంద్రం, సీజేఐ ఆదేశంపై రేపు అఫిడవిట్ సమర్పిస్తామని వెల్లడి.
రైతుల ఆందోళనలో నిషిధ్ధ ఖలిస్తానీయులు కూడా చేరారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాన్ చేసిన ఈ సంస్థ ఈ నిరసనల్లో పాల్గొంటోందని..
రైతుల ఆందోళనలో నిషిధ్ధ ఖలిస్తానీయులు కూడా చేరారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాన్ చేసిన ఈ సంస్థ ఈ నిరసనల్లో పాల్గొంటోందని కేంద్ర చట్టాలను సమర్థిస్తున్న రైతు సంఘమొకటి వెల్లడించింది. ఈ సంస్థ తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ హరీష్ సాల్వే.. అన్నదాతల ఆందోళనలో ఖలిస్థానీ పతాకాలు కనబడుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ బాబ్డే..ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ను ఆదేశించారు. ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆయన సూచనపై ..అటార్నీ జనరల్.. ఇందుకు అంగీకరిస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టులను కూడా సమర్పిస్తామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు అన్నదాతల ప్రొటెస్ట్ లో ఖలిస్తానీలు, టెర్రరిస్టులు ప్రవేశించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ఇప్పుడు ఈ అంశం ఏకంగా సుప్రీంకోర్టుకెక్కడంతో ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:
SICMA : సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా సౌత్ ఇండియా.. ఒక్కటైన దక్షిణాది రాష్ట్రాల సిమెంట్ కంపెనీలు