బాలికల వివాహంపై వయో పరిమితి ఎందుకు ? దీన్ని పెంచాల్సిందే ! మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
సమాజంలో బాలికల వివాహ వయో పరిమితిని 18 ఏళ్లుగా, యువకులకు 21 ఏళ్లుగా నిర్ధారించడం ఏమిటని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్..
Minimum Marriageable Age : సమాజంలో బాలికల వివాహ వయో పరిమితిని 18 ఏళ్లుగా, యువకులకు 21 ఏళ్లుగా నిర్ధారించడం ఏమిటని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రశ్నించారు. బాలికల వివాహ వయో పరిమితిని కూడా పెంచాల్సిందే అన్నారాయన. దీన్ని పబ్లిక్ఇష్యుగా చేయదలిచానని, దీనిపై చర్చ జరగాలని ఆయన సూచించారు. సమయం వస్తే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అమ్మాయిల పెళ్ళికి సంబంధించి ఈ లిమిట్ ను పెంచితే తప్పేమిటన్నారు. మహిళల డిగ్నిటీ, సెక్యూరిటీపై మంగళవారం భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత 8 నెలల్లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఇందుకు తమ ప్రభుత్వ కృషే కారణమన్నారు.
మధ్యప్రదేశ్ లో మిస్సింగ్ అయిన బాలికల ఆచూకీ కనుగొని వారిని వారి తలిదండ్రులకు అప్పగించడంలో తమ సర్కార్ చాలావరకు సఫలీకృతమైందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. 7100 మంది అమ్మాయిలు కనబడకపోగా వారిని వారి పేరెంట్స్ కి అప్పజెప్పామని, ఇంకా జాడ తెలియని వారికోసం అన్వేషణ జరుగుతోందని ఆయన అన్నారు. మిస్సింగ్ చిల్డ్రన్ కి సంబంధించిన కేసుల్లో వారి తలిదండ్రులకు రిపోర్ట్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని, ఇందుకు ప్రతి 15 రోజులకొకసారి ఆయా వార్డుల్లో వీరు సమాచారం తెలుసుకోవచ్ఛునని ఆయన వివరించారు.
Also Read:
union budget 2020-21 : కొత్త కోవిడ్ -19 సెస్‌ను కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టనుందా..?
రైతుల ఆందోళనలో ఖలిస్తానీలు, సుప్రీంకోర్టులో ప్రస్తావించిన కేంద్రం, సీజేఐ ఆదేశంపై రేపు అఫిడవిట్