Special Maternity Leave: మెటర్నిటీ సెలవులపై కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రత్యేక సెలవుల వర్తింపు

బిడ్డ పుట్టిన వెంటనే మరణం.. తల్లి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించడమే కాదు.. మానసికంగా గాయం చేస్తుందని.. వీటిని దృష్టిలో ఉంచుకుని మహిళా కేంద్ర ప్రభుత్వోద్యోగికి  60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Special Maternity Leave: మెటర్నిటీ సెలవులపై కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రత్యేక సెలవుల వర్తింపు
Special Maternity Leave For
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2022 | 11:27 AM

Special Maternity Leave: ఏ స్త్రీకైనా మాతృత్వం ఓ వరం.. అమ్మతనం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది.. నవమాసాలు మోసి .. బిడ్డకు జన్మనిచ్చే సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళకు పుట్టిన వెంటనే పురిటిలో బిడ్డను కోల్పోతే ఆ  తల్లి పడే వేదన, క్షోభగురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి బాధిత మహిళలకు ఉపశమనం కలిగించడం .. మానసికంగా విశ్రాంతిని ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది.  పుట్టిన వెంటనే బిడ్డ మరణించినా, మృత శిశువు జన్మించినా కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు లభిస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బిడ్డ మరణంవలన ఆ తల్లిపడే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం కేంద్రప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు వర్తిస్తుందని పేర్కొంది.

ఒక బిడ్డ పుట్టినవెంటనే మరణిస్తే సెలవు, ప్రసూతి సెలవు మంజూరుకు సంబంధించిన వివరణ కోసం అభ్యర్థిస్తూ అనేక సూచనలను, ప్రశ్నలను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. “ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ విషయం పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది.

బిడ్డ పుట్టిన వెంటనే మరణం.. తల్లి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించడమే కాదు.. మానసికంగా గాయం చేస్తుందని.. వీటిని దృష్టిలో ఉంచుకుని మహిళా కేంద్ర ప్రభుత్వోద్యోగికి  60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్య ధృవీకరణ పత్రం కోసం పట్టుబట్టకుండా ఆమె సెలవు ఖాతాలో అందుబాటులో ఉన్న సెలవులను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మహిళా కేంద్ర ప్రభుత్వోద్యోగి ప్రసూతి సెలవును పొందని పక్షంలో, పుట్టిన / చనిపోయిన వెంటనే బిడ్డ గడువు ముగిసిన తేదీ నుండి 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు మంజూరు చేయబడవచ్చని పేర్కొంది.

ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న మహిళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే వర్తిస్తుందని.. అది అధీకృత ఆసుపత్రిలో పిల్లల ప్రసవానికి మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. అధీకృత ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రిగా నిర్వచించారు.

ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవం జరిగితే.. దీనికి సంబంధించిన అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని డిఓపిటి ఆర్డర్ తెలిపింది. 1972లోని సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (హాలీడేస్) రూల్ 2 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్,  పోస్ట్‌లకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..