Tenth Exams: టెన్త్ పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. ఒకరు పాస్, మరొకరు ఫెయిల్..
చదువుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కుటుంబకారణాలతో కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తారు. మరి కొందరు మాత్రం తమ కోరికను అలాగే ఉంచుకుని వీలున్నప్పుడల్లా నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పెద్ద వయసు ఉన్న వారు...
చదువుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కుటుంబకారణాలతో కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తారు. మరి కొందరు మాత్రం తమ కోరికను అలాగే ఉంచుకుని వీలున్నప్పుడల్లా నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పెద్ద వయసు ఉన్న వారు కూడా చిన్నవాళ్లతో కలిసి పరీక్షలు రాయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా పుణెలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ తండ్రి తన కుమారుడితో కలిసి పరీక్షలు రాశాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ పరీక్షల్లో తండ్రి పాస్ అవగా.. కుమారుడు ఫెయిల్ అయ్యాడు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన భాస్కర్ వాగ్‌మారే చిన్నతనంలోనే చదువు ఆపేశాడు. చదువుకోవాలనే కోరిక ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. ఇటీవల నిర్వహించిన పరీక్షలతో తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాశాడు. ఆ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రిజల్ట్స్ చూసిన కుటుంబ సభ్యులు షాకు కు గురయ్యారు. నవ్వాలో, ఏడవాలో తెలియక అయోమయానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదువు మానేసిన భాస్కర్ పదో తరగతి పరీక్షల్లో పాస్ అయ్యాడు. అతని కుమారుడు మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి విచిత్రంగా మారింది.
కాగా భాస్కర్ కు.. చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబపరిస్థితులు, ఆర్థికి స్థితిగతులు సరిగ్గా లేకపోవడంతో ఏడో తరగతి వరకు చదువుకుని ఆపేశాడు. తర్వాత కుటుంబబాధ్యతలు మీద పడటంతో చదువు పూర్తిగా దూరమైంది. అయితే ఆయనకు మళ్లీ చదువుకొని, పదో తరగతి పాస్ కావాలని నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు కూడా ఇదే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తుండటం అతనికి కలిసివచ్చింది. తన కుమారుడితో కలిసి నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యేవాడు. అలా ఎంతో కష్టపడి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు.
కొద్దికాలం నుంచి తిరిగి చదువుకోవాలని అనిపించింది. కొన్ని కోర్సులు చేయడం వల్ల మరింత సంపాదించొచ్చనే ఆలోచన కలిగింది. అందుకే పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. నా కుమారుడు కూడా ఈ ఏడాదే పరీక్షలు రాశాడు. నేను పాస్ అయినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. కొడుకు ఫెయిల్ కావడం మాత్రం బాధిస్తోంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాసయ్యేలా కొడుకుకు సహకారం అందిస్తాను. ఈసారి తప్పకుండా అతను పాస్ అవుతాడని భాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి