కర్ణాటకలో మరో పరువు హత్య.. కూతురును చంపి పూడ్చిన తండ్రి

కర్ణాటకలో మరో దారుణంలో వెలుగుచూసింది. దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు.

కర్ణాటకలో మరో పరువు హత్య.. కూతురును చంపి పూడ్చిన తండ్రి
Follow us

|

Updated on: Oct 17, 2020 | 3:40 PM

కర్ణాటకలో మరో దారుణంలో వెలుగుచూసింది. దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. కర్ణాటకలోని రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏండ్ల దళిత యువకుడితో సంబంధం పెట్టుకుందన్న కారణం చేత 18 ఏండ్ల బాలికను ఆమె తండ్రి, వరుసకు సోదరులైన మరో ఇద్దరు ఈ నెల 9న గ్రామ శివారులోని తోటలోకి తీసుకెళ్లారు. డంబుల్‌తో ఆమె తలపై మోది హతమార్చి అక్కడ పూడ్చిపెట్టారు. అనంతరం తన కుమార్తె కనిపించడంలేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశాడు తండ్రి. పోలీసులు ఆ దళిత యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు బాలిక అదృశ్యం వెనుక అతడి ప్రమేయం లేదని తెలిసింది. ఇది పరువు హత్యగా పోలీసులు తేల్చారు.

మరోవైపు, ఆరు రోజుల తర్వాత ఆ తోటలో మొక్కలు నాటేందుకు అక్కడివారు తవ్వగా శిథిలమైన బాలిక మృతదేహం బయటపడింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తండ్రితో పాటు మరో ఇద్దరు నిందితులుగా నిర్ధారించారు. రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని 18 ఏళ్ల యువతి ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చాలనుకున్నాడు. మరో ఇద్దరు బంధువుల సహకారంతో బాలికను ఓ తోటలోకి తీసుకెళ్లి చంపి.. అక్కడే పూడ్చేశారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మరో ఇద్దరి సహాయంతో తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..