కరోనా వ్యాక్సిన్ కోసం అర లక్ష షార్క్‌లు బలి
సకల చరాచర సృష్టిలో స్వార్థపరుడెవరైనా ఉన్నారంటే అది మనిషే! తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు.. తను బతకడం కోసం ఇతర జీవాలను చంపేస్తాడు.. ఇప్పుడు కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు తలమునకలుగా ఉన్నారు కదా!
సకల చరాచర సృష్టిలో స్వార్థపరుడెవరైనా ఉన్నారంటే అది మనిషే! తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు.. తను బతకడం కోసం ఇతర జీవాలను చంపేస్తాడు.. ఇప్పుడు కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు తలమునకలుగా ఉన్నారు కదా! ఆ కరోనా వ్యాక్సిన్ తయారీకి లక్షల సంఖ్యలో షార్క్‌లు బలికావాల్సిందేనంటున్నారు వారు.. షార్క్ లివర్ ఆయిల్‌ను వాక్సిన్ తయారీలో ఉపయోగిస్తారట! ఇప్పటికే షార్క్‌లను చంపేసి వాటి నుంచి షార్క్ లివర్ ఆయిల్‌ను తయారు చేసి సౌందర్యసాధనాలలో ఉపయోగించుకున్నాం! కరోనా వ్యాక్సిన్ ఉత్తమ ఫలితాల కోసం షార్క్ లివర్ ఆయిల్ వాడాల్సిందేనని శాస్త్రవేత్తలు చెప్పడం షార్క్ పరిరక్షణ నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా 193 రకాల కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.. ఇందులో అయిదారు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో షార్క్ ఆయిల్‌ను ఉపయోగించాలనుకుంటున్నాయి.. కారణం దాని వల్ల రోగ నిరోధకశక్తి పెరగడమే! ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి వంద కోట్ల డోస్‌లు తయారుచేయాలని బ్రిటన్ అంటోంది.. ఒక్కో మనిషికి ఒక్కో డోస్ ఇవ్వాలనుకున్నా పాతిక లక్షల షార్క్‌లను బలివ్వాల్సి వస్తుంది. అదే ఒక్కొక్కరికి రెండేసి డోస్‌లు ఇవ్వాల్సి వస్తే అర లక్ష షార్క్‌లను చంపాల్సి వస్తుంది.. అలా అయితే షార్క్‌ల మనుగడే ప్రశ్నార్థంగా మారుతుందని షార్క్ పరిరక్షణ నిపుణులు అంటున్నారు.. షార్క్ ఆయిల్‌కు బదులుగా చెరకు, గోధుమ, ఈస్ట్‌లను వాడొచ్చని వారు చెబుతున్నారు. తమకు మాత్రం షార్క్‌లను చంపడం ఇష్టం లేదు కానీ, షార్క్ ఆయిల్‌కు బదులుగా మరోదానితో వ్యాక్సిన్‌ను రూపొందిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని తెలిస్తే షార్క్‌లను ఎందుకు చంపుతామని ప్రశ్నిస్తున్నారు..