‘ట్రంప్ వచ్చి బీహార్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాడా’ ? తేజస్వి యాదవ్

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల 'మహా ఘట్ బంధన్' శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఈ 'మహా కూటమి'..బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తింది.

'ట్రంప్ వచ్చి బీహార్ కి ప్రత్యేక  ప్రతిపత్తి ఇస్తాడా' ? తేజస్వి యాదవ్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2020 | 3:48 PM

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ‘మహా ఘట్ బంధన్’ శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఈ ‘మహా కూటమి’..బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తింది. గత 15 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, కానీ ప్రత్యేక ప్రతిపత్తి మాత్రం రాలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తాడా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ఇన్నేళ్ళుగా ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటికీ స్పెషల్ కేటగిరీ మాత్రం రాలేదన్నారు. బీజేపీ, జేడీ-యూ అధినేత నితీష్ ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని ఆయన  దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతలు హామీ ఇచ్చారు.   ఈ 15 ఏళ్లలో రాష్ట్రంలో  నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని తేజస్వి యాదవ్ అన్నారు. 2005 లో నితీష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ ప్రత్యేక ప్రతిపత్తి అంశం తెరమీదకి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం కొన్ని పార్టీల నేతలు ఈ నినాదాన్ని ప్రస్తావించారు. కాగా ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణవీర్ సింగ్ సూర్జేవాలా కూడా పాల్గొని..రాష్ట్రంలో మార్పు రావాలని తాము కోరుతున్నామన్నారు.