మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్‌మెంట్.. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లు!‌

దేశీయ కంపెనీ 'మైక్రోమాక్స్' మొబైల్ ఫోన్ల తయారీలో తనదైన శైలి ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తమ సత్తాను భారత్‌ మార్కెట్‌లో చాటుకునేందుకు..

మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్‌మెంట్.. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లు!‌
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 17, 2020 | 4:41 PM

Micromax teases new in-series smartphone: దేశీయ కంపెనీ ‘మైక్రోమాక్స్’ మొబైల్ ఫోన్ల తయారీలో తనదైన శైలి ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తమ సత్తాను భారత్‌ మార్కెట్‌లో చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు మేరకు పరిమితి బడ్జెట్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘ఇన్(In)’ అనే అక్షరాలతో కూడిన ఫోన్ బాక్స్‌ను చూపిస్తోన్న యాడ్‌ను ఆ కంపెనీ తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ కంపెనీ కో ఫౌండర్ రాహుల్ శర్మ త్వరలోనే ‘In’ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

కాగా, గతంలో మొబైల్ ఫోన్స్ రంగంలో దేశీయంగా కార్బోన్, లావా, మైక్రోమాక్స్ ఎంతో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్. అయితే నెమ్మదిగా తక్కువ ధరల్లో చైనీస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో వీటి డౌన్‌ఫాల్ మొదలైంది. అయితే ఇప్పుడు మరోసారి ఇండియన్ మార్కెట్‌లో తమ సత్తాను చాటేందుకు మైక్రోమాక్స్ సిద్ధమైంది. తక్కువ ధరల్లో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ ఈ ఏడాది మొదటి నుంచి వరుస ట్వీట్లు పెడుతూ వస్తోంది. చైనా కంపెనీలకు పోటీగా ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటు ధరలో మైక్రోమాక్స్ కొత్త ఫోన్లను తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 7,000 నుంచి 15,000 మధ్య ఫోన్ ధర ఉండొచ్చని సమాచారం.