AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కువైట్ వెళ్లే ప్రతిఒక్కరికీ ఆ సర్టిఫికేట్ తప్పనిసరి

కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ వచ్చే ప్రతిఒక్కరికీ పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ తప్పనిసరి అని అధికారులు ప్రకటించారు.

కువైట్ వెళ్లే ప్రతిఒక్కరికీ ఆ సర్టిఫికేట్ తప్పనిసరి
Balaraju Goud
|

Updated on: Oct 17, 2020 | 4:34 PM

Share

కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ వచ్చే ప్రతిఒక్కరికీ పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ తప్పనిసరి అని అధికారులు ప్రకటించారు. ఇకపై విమానాశ్రయంలో చేసే స్వాబ్ టెస్టు, 14 రోజుల క్వారంటైన్‌ కాకుండా పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అలాగే, కువైట్ ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలు ఉల్లఘించే వారిని కూడా దేశంలో ప్రవేశించడాన్ని అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. అరబ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే పొరుగు దేశాల్లో చిక్కుకున్నారో వారికి కొవిడ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అలాంటి మినహాయింపులేమి లేవని, అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని తారిఖ్ అల్ ముజ్రిమ్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా కువైట్ లో కరోనా బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తారిఖ్ తెలిపారు.

Follow Us