AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇవే!

Paap Kartari Yoga: జాతకంలో పాప కర్తరి యోగం ఉంటే జీవితంలో ఆటంకాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నమ్మకం. ఈ అశుభ యోగం ఎలా ఏర్పడుతుంది? దాని ప్రభావాలు ఏమిటి? వాటిని తగ్గించేందుకు సూచించే పరిహారాలు ఏమిటో తెలుసుకోండి.

మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇవే!
Paap Kartari Yoga
Rajashekher G
|

Updated on: Jul 03, 2026 | 10:05 PM

Share

Paap Kartari Yoga in Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాల శుభ, అశుభ యోగాల గురించి ప్రస్తావించబడింది. ఇవి వ్యక్తి జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయని విశ్వసిస్తారు. అలాంటి అశుభ యోగాల్లో ‘పాప కర్తరి యోగం’ ఒకటి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ యోగం జాతకంలో ఏర్పడితే జీవితంలో అనేక అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా, ఒక గ్రహం లేదా భావం ఇవ్వాల్సిన శుభ ఫలితాలు ఆలస్యం కావడం లేదా తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు.

పాప కర్తరి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది?

‘కర్తరి’ అంటే కత్తెర. పేరు సూచించినట్లుగానే, ఈ యోగం ఒక గ్రహం లేదా భావాన్ని రెండు వైపుల నుంచి అశుభ గ్రహాలు చుట్టుముట్టినప్పుడు ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని, కుజుడు, రాహు, కేతువు వంటి పాప గ్రహాలు (కొన్ని సందర్భాల్లో సూర్యుడిని కూడా పరిగణిస్తారు) ఒక గ్రహం లేదా భావానికి ఇరువైపులా ఉన్నప్పుడు దానిని పాప కర్తరి యోగం అంటారు. ఈ యోగం కారణంగా మధ్యలో ఉన్న గ్రహం లేదా భావం తన సహజ శుభ ఫలితాలను పూర్తిగా ఇవ్వలేకపోతుందని జ్యోతిష్యులు పేర్కొంటారు. ఫలితంగా, ఆ గ్రహం లేదా భావానికి సంబంధించిన జీవిత రంగాల్లో ఆటంకాలు, ఆలస్యాలు లేదా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పాప కర్తరి యోగం వల్ల కలిగే ప్రభావాలు

పాప కర్తరి యోగం ప్రభావం ఏ గ్రహం లేదా భావం చిక్కుకుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. గురు గ్రహం.. పాప కర్తరి యోగంలో చిక్కుకుంటే విద్య, జ్ఞానం, ఆర్థిక స్థితి లేదా అదృష్టానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతారు. దశమ భావం.. (కెరీర్, ఉద్యోగం, వ్యాపారం) ఈ యోగం ప్రభావంలో ఉంటే ఉద్యోగంలో ఆటంకాలు, పదోన్నతిలో ఆలస్యం లేదా వృత్తిపరమైన ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్య నమ్మకం. అలాగే, ఏ భావం ప్రభావితమైతే, ఆ భావానికి సంబంధించిన అంశాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

పాప కర్తరి యోగానికి జ్యోతిష్య పరిహారాలు

జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం, ఈ యోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను సూచిస్తారు. ప్రతిరోజూ గాయత్రీ మంత్రం జపించడం. దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం. దుర్గా సప్తశతి పారాయణం చేయడం. హనుమాన్ చాలీసా పఠించడం. అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహా మేరకు, ప్రభావితమైన గ్రహం లేదా భావానికి అనుగుణంగా ప్రత్యేక పరిహారాలు చేయడం.

(Disclaimer: పాప కర్తరి యోగం, దాని ప్రభావాలు, పరిహారాలు అన్నీ జ్యోతిష్య శాస్త్రంలోని సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత నిర్ణయాల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)

Follow Us
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
డ్రీమ్ క్యాచర్‌కు కూడా వాస్తు ఉందా? ఏ దిశలో ఉంచితే శుభం, ఏ దిశలో
డ్రీమ్ క్యాచర్‌కు కూడా వాస్తు ఉందా? ఏ దిశలో ఉంచితే శుభం, ఏ దిశలో
రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి డబ్బులు..
రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి డబ్బులు..
నో సోషల్ మీడియా.. 3సార్లు UPSC ఫెయిల్.. ఈ అమ్మాయి కథ మీకుచెప్పాలి
నో సోషల్ మీడియా.. 3సార్లు UPSC ఫెయిల్.. ఈ అమ్మాయి కథ మీకుచెప్పాలి