కుబేర పచ్చ కుంకుమ రహస్యం తెలుసా? దీన్ని ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుందట!
03 July 2026
Rajashekher
హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు అధిపతి. ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆయనపై ఉంటుందని, అందుకే సంపదకు ప్రతీకగా కుబేరుడిని భావిస్తారు.
కుబేరుడు ధనాధిపతి
ఎర్ర కుంకుమ, సింధూరం, మీనాక్షి కుంకుమలతో పాటు "కుబేర పచ్చ కుంకుమ" కూడా ప్రత్యేకమైనదిగా పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇది కుబేరునికి అత్యంత ప్రీతికరమైన కుంకుమగా చెబుతారు.
పచ్చ కుంకుమకు ప్రత్యేక స్థానం
ఆకుపచ్చ రంగు పార్వతీదేవికి కూడా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందువల్ల ఈ కుంకుమను శుభం, ఐశ్వర్యానికి ప్రతీకగా పరిగణిస్తారు.
పార్వతీదేవికి ఇష్టమైన రంగు
ఒకసారి కుబేరుడు కైలాసానికి వెళ్లి శివపార్వతులను దర్శించినప్పుడు, పార్వతీదేవిని చూసి క్షణికంగా కామవికారం కలిగిందని పురాణ కథనం చెబుతుంది.
కైలాసంలో జరిగిన సంఘటన
కుబేరుని మనసులోని భావాన్ని గ్రహించిన శివపార్వతులు ఆగ్రహంతో చూశారు. వారి ఉగ్ర దృష్టి ప్రభావంతో కుబేరుని శరీరం కాలిపోయి కమిలిపోయిందని కథనం పేర్కొంటుంది.
శివపార్వతుల ఆగ్రహం
తన తప్పును గ్రహించిన కుబేరుడు పరమశివుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. అతని భక్తిని చూసి శివపార్వతులు కరుణించి అనుగ్రహించారు.
పశ్చాత్తాపంతో క్షమాపణ
శివుని నీలవర్ణ కంఠం, పార్వతీదేవి పసుపు ఛాయల కరుణా కిరణాలు కలిసిన చోట మట్టి ఆకుపచ్చ రంగులోకి మారిందని పురాణాల్లో వర్ణించబడింది.
ఆకుపచ్చ మట్టి ఆవిర్భావం
కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని శరీరానికి పూసుకోవడంతో కాలిన గాయాలు తగ్గి మామూలు స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆ మట్టిని తన రాజ్యానికి తీసుకెళ్లి నిత్యం ఉపయోగించేవాడని ఐతిహ్యం.
పచ్చ మట్టితో కుబేరునికి స్వస్థత
ఈ సంఘటన తర్వాత ఆ ఆకుపచ్చ మట్టి "కుబేర పచ్చ కుంకుమ"గా ప్రసిద్ధి చెందిందని నమ్మకం. దీన్ని ధరించడం వల్ల ధనలక్ష్మి, కుబేరుని అనుగ్రహం లభించి ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.