AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసు.. రైతు సంఘం నేత రాకేష్ తికాయత్

కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసునని రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద అన్నదాతలు 'కిసాన్' సంసద్' ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసు.. రైతు సంఘం నేత రాకేష్ తికాయత్
Rakesh Tikait
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 24, 2021 | 9:18 PM

Share

కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసునని రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద అన్నదాతలు ‘కిసాన్’ సంసద్’ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు హింసాత్మక ఘటనలు జరిగిన అనంతరం మళ్ళీ నగరంలో మొదటిసారిగా రైతులు శాంతియుతంగా నిరసన పాటిస్తున్నారు. వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలని తాము ఇన్ని నెలలుగా కోరుతున్నామని, కానీ కేంద్రంలో చలనం లేదని తికాయత్ ఆరోపించారు. ఇది మూగ, చెవిటి ప్రభుత్వమని దుయ్యబట్టారు. తమను నిర్లక్ష్యం చేసినవారికి ఈ రైతులు గట్టిగా బుద్ధి చెబుతారని, తమ సత్తా చూపుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ఓ అవగాహన తెచ్చేందుకే ‘కిసాన్ పార్లమెంట్’ ఉద్యమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు రైతులంతా సమైక్యంగా ఉండాలని ఆయన కోరారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అన్నదాతలు జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13 తో ముగియనున్నాయి. తాము అంతవరకు నిరసన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నప్పటికీ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వీరికి ఆగస్టు 9 వరకే అనుమతించారు. పైగా తాజాగా ఆయన..జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులకు విస్తృత అధికారాలు ఇస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ చట్టం కింద .. పోలీసులు .. దేశ భద్రత,శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారిని వెంటనే అరెస్టు చేయవచ్చు. అయితే ఈ ఆదేశాలను తాము శిరసావహిస్తామని తికాయత్ పేర్కొన్నారు. మా ఆందోళన ఇంకా సజీవంగా ఉందని ప్రభుత్వానికి చూపడానికే దీన్ని కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధం… అయితే ఓ షరతు.. అసదుద్దీన్ ఒవైసీ

Tollywood: ప్రజంట్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?