Fraud: మామూలోడు కాదు.. నకిలీ పెయిడ్ లీవ్స్‌తో రూ.10 కోట్లు స్వాహా చేసిన ప్రభుత్వ ఉద్యోగి
Paid Leaves Fraud: ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. అయినా.. డబ్బు సంపాదించాలని ప్లాన్ రచించాడు. చిన్నా చితకా ఎందుకులే.. ఒకేసారి భారీ స్కాం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే రూ. 10కోట్లు స్వాహా చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి
Paid Leaves Fraud: ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. అయినా.. డబ్బు సంపాదించాలని ప్లాన్ రచించాడు. చిన్నా చితకా ఎందుకులే.. ఒకేసారి భారీ స్కాం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే రూ. 10కోట్లు స్వాహా చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి నకిలీ పెయిడ్ లీవ్స్‌తో ఏకంగా రూ.10కోట్లు దండుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రాజేష్ రామి పెయిడ్ లీవ్స్ తో భారీ మోసానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని ఎనిమిది తాలూకాల్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పేరుతో సుమారు 5000 నకిలీ పెయిడ్ లీవ్స్‌ను ప్రభుత్వానికి అప్లై చేశాడు. ఆ పెయిడ్ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చాడు. అనంతరం ఆ నగదును తన, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ విషయం మూడేళ్ల తరువాత బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు.
2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలూకాలు సమర్పించిన డాక్యుమెంట్లను తాజాగా అధికారులు ఆడిట్ చేశారు. దీంతో ఈ విషయం బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం బయటపడటంతో.. సంబంధిత అధికారులు ఈ నెల 15న రాజేష్ రామి చీటింగ్‌పై కరంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఆర్థిక ఏడాది 2016-17 నుంచి 2020-21 మధ్యలో అతడు ఈ స్కామ్‌కు పాల్పడి ఉంటాడని, రెండు ఏళ్ల ఆడిట్‌లో తేలిన రూ.10 కోట్ల కంటే ఎక్కువగానే చీటింగ్ చేసి ఉంటాడని విద్యాశాఖ అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌లో మరికొందరి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా.. ఈ కేసు నమోదైన అనంతరం నిందితుడు రాజేష్ రామి పరారయ్యాడు.
Also Read: