లెఫ్టినెంట్ గవర్నర్ చర్య ఢిల్లీ ప్రజలకు అవమానకరం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలనికోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టరాదని లాయర్ల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తిరస్కరించడం ఢిల్లీ ప్రజలకే అవమానకరమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ చర్య ఢిల్లీ ప్రజలకు అవమానకరం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు
Arvind Kejriwal

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలనికోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టరాదని లాయర్ల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తిరస్కరించడం ఢిల్లీ ప్రజలకే అవమానకరమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాదనడం ఈ నగర ప్రజలకే ఇన్సల్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రాత్మకమైన ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, బీజేపీని ఓడించారని ఆయన చెప్పారు. ఈ దేశాన్ని బీజేపీ పాలించనివ్వండి..అలాగే ఈ ఢిల్లీ నగరాన్ని ఆప్ పాలించనివ్వండి.. కానీ మేము చేసే ప్రతి పనిలోనూ మీరు జోక్యం చేసుకోవడం సముఛితం కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఈ నగర ప్రజలకు అవమానకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ గౌరవించాలన్నారు. ప్రొటెస్ట్ చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు పెట్టరాదన్న ప్రతి[పాదనపై రాష్ట్ర కేబినెట్ ఓ లాయర్ల కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించడం ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది.

అసలు ఆ పానెల్ నే ఆయన తిరస్కరిస్తూ.. ఇందుకు బదులు ఢిల్లీ పోలీసులు నియమించిన 11 మంది లాయర్ల పానెల్ ని ఆమోదించారు. గత జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పలువురు రైతులపై కేసులు పెట్టారు. అయితే ఆ రైతుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా వ్యవహరించాలన్న ప్రతిపాదన మేరకు కేజ్రీవాల్ నేతృత్వంలోని కేబినెట్ ఓ లాయర్ల కమిటీని నియమించింది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ కి నచ్చలేదు. చూడబోతే ఇది చిలికి చిలికి గాలివానగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసు.. రైతు సంఘం నేత రాకేష్ తికాయత్

యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధం… అయితే ఓ షరతు.. అసదుద్దీన్ ఒవైసీ

Click on your DTH Provider to Add TV9 Telugu