Air Crashes: విహంగ ప్రయాణాలు మిగిల్చిన విషాదాలు.. ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు..!

హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక విహంగ ప్రయాణాలు చాలా సులువుగా మారాయి. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి.

Air Crashes: విహంగ ప్రయాణాలు మిగిల్చిన విషాదాలు.. ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు..!
Cds Bipin Rawat


Famous Personalities in Air Crashes: నేల విడిచి నింగిలో చేసే ప్రయాణం ఎంత వేగవంతమో, అంతే ప్రమాదకరం. విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు. హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక విహంగ ప్రయాణాలు చాలా సులువుగా మారాయి. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

అయితే, ఇప్పటివరకు ప్రముఖులు ప్రయాణిస్తున్న విమానాలు, హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలను కోల్పోయారు. ప్రముఖులు ఇలాంటి విపత్తులలో కూడా మరణించారు. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రసిద్ధ వ్యక్తుల పేర్లను చూద్దాం.

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలిపాక్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులోని కోయంబత్తూర్, కూనూరు మధ్య కుప్పకూలింది. అందులో రావత్, ఆయన భార్యసహా 14 మంది ప్రయాణించారు. కూనూరు నుంచి విల్లంగ్టన్ ఆర్మీ బేస్ కు వెళుతున్న సమయంలో ఎంఐ7 హెలికాప్టర్ ఇలా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరణాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఇక, ఇప్పటివరకు సంభవించిన విమాన ప్రమాదాలు మరణించిన ప్రముఖులు

1. 2021 డిసెంబర్8..భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్
తమిళనాడులోని కూనూరు మధ్య హెలికాప్టర్ ప్రమాదం. 14 మంది మృతి

2. 1980 జూన్23.. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మృతి
తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్ ప్రమాదంలో మృతి
ఢిల్లీ సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే కూలి స్పాట్ లోనే మృతి

3. 1973 మే31…కాంగ్రెస్ మాజీ ఎంపీ మోహన్ కుమారమంగళం విమానం ప్రమాదాంలో మృతి
మృతదేహాలు చెదిరిపోగా, పార్కర్ పెన్, ఆయన ధరించిన వినికిడి యంత్రం సహాయంతో గుర్తింపు

4. 2001, సెప్టెంబర్ 30..కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా
యూపీలోని కాన్పూర్‌కు బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళుతుండగా దుర్ఘటన

5. 2001 అరుణాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మాజీ మంత్రి డేరా నాథుండ్ హెలికాప్టర్ ప్రమాదం, మృతి
2004 హెలికాప్టర్ ప్రమాదంలో మేఘాలయ మంత్రి సంగ్మా, ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు మొత్తం 10 మంది మృతి

6. 2002, మార్చి3.. లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదం
భీమవరం నుంచి తిరిగివస్తుండగా కువ్వడలంక గ్రామం వద్ద సాంకేతిక సమస్య
కొబ్బరి చెట్టును ఢీకొట్టి మీపంలోని చేపల చెరువులో కూలిన వైనం

7.2004 ఏప్రిల్17 ప్రముఖ నటి సౌందర్య మృతి
బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం పక్కన కుప్పకూలింది.
సౌందర్య సజీవ దహనం, ప్రాణాలతో బయటపడ్డ ఆమె సోదరుడు అమరనాథ్

8. 2005 మార్చి31…జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదం మృతి
యూపీలోని సహారన్ పూర్ లో కుప్పకూలింది.

9. 2009 సెప్టెంబర్3 ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బెల్ 430 హెలికాప్టర్ లో ప్రయాణం
నల్లమలలోని పావురాలగుట్ట వద్ద కూలింది. వైఎస్ తో పాటు ఐదుగురు మృతి

10. 2011 అరుణాచల్ ప్రదేశ్ సిఎం ధోర్జీ ఖండూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి
ప్రతికూల వాతావరణం కారణంగా లోబో తాండ్ వద్ద కూలింది
సీఎం దోర్జీ ఖండూతో సహా ఐదుగురు మృతి

11. 1945 ఆగస్టు18..సుభాష్ చంద్రబోస్ తైవాన్‌ విమాన ప్రమాదంలో చనిపోయారని చెబుతారు.

Read Also…  CDS Bipin Rawat: భారత్ సీడీఎస్​ ‘బిపిన్​ రావత్’​ ప్రొఫైల్ సహా ఇతర వివరాలు..


Published On - 5:56 pm, Wed, 8 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu