AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్.. డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు.. అరవింద్ కేజ్రీవాల్ ఫైర్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రివాల్‌ను దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఎం కేజీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ రికార్డ్ చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రివాల్ ను అధికారులు ప్రశ్నించారు.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్.. డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు.. అరవింద్ కేజ్రీవాల్ ఫైర్..
Arvind Kejriwal
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2023 | 7:00 AM

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రివాల్‌ను దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఎం కేజీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ రికార్డ్ చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రివాల్ ను అధికారులు ప్రశ్నించారు. లిఖిత పూర్వకంగా, మౌలికంగా ఆయన నుంచి సీబీఐ అధికారులు సమాధానాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా పర్యవేక్షణలో స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పూర్తి అవాస్తవమని, ఫేక్ అంటూ అరవింద్ కేజ్రీవాల్ మరోమారు స్పష్టంచేశారు. కావాలనే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. సీబీఐ అధికారులు అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ని రాజకీయ కుట్రల్లోంచి పుట్టిన కుటిల యత్నంగా అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడానికి జరుగుతున్న కుట్రల ఫలితమే ఈ కేసులు విచారణలు అని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

9 గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రిసీవ్‌ చేసుకున్నారు. అయితే.. ఆయన్ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సీబీఐ మాత్రం కేజ్రీవాల్‌ను సాక్షిగానే విచారించినట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం..

సీబీఐ విచారణ అనంతరం సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ సైతం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ సోమవారం ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..