Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే టెర్రరిస్టుల హతం!

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ నుండి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం(మే 13) తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే టెర్రరిస్టుల హతం!
Encounter
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2025 | 2:54 PM

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ నుండి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం(మే 13) తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతోంది.

ఇటీవల భద్రతా సంస్థలు ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసా పోస్టర్లను విడుదల చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ‘టెర్రర్ ఫ్రీ కాశ్మీర్’ ప్రచారం కింద ఈ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ ముగ్గురు ముఖ్యమైన పాత్ర పోషించార భద్రతా దళాలు భావిస్తున్నాయి.

జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సోదాల సమయంలో, దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత రెండు వైపుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తోంది. మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ మూలాల ప్రకారం వారంతా లష్కరే తోయిబా సభ్యులుగా భావిస్తున్నారు. మిగిలిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో జాగ్రత్తగా సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భద్రతా దళాలకు ఈ సంఘటన గొప్ప విజయాన్ని అందించింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది