ఎంత దాచిన దాగవు కదా..! ఒక్కొక్కటిగా బయటపడుతున్న పాక్ ఓటమి ఆధారాలు..!
భారతదేశం చేతిలో ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ తన వైఫల్యాన్ని, ఓటమిని ప్రపంచానికి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. షాబాజ్ ప్రభుత్వ నాయకులు, అధికారులు భారతదేశంపై ఈ యుద్ధంలో మనమే గెలిచామని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యాలు, భారతీయ సైన్యం చేసిన విధ్వంస చిత్రాలు, ఆధారాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

భారతదేశం చేతిలో ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ తన వైఫల్యాన్ని, ఓటమిని ప్రపంచానికి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. షాబాజ్ ప్రభుత్వ నాయకులు, అధికారులు భారతదేశంపై ఈ యుద్ధంలో మనమే గెలిచామని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యాలు, భారతీయ సైన్యం చేసిన విధ్వంస చిత్రాలు, ఆధారాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
తాజాగా షాబాజ్ సర్కార్‌కు చెందిన ఇద్దరు అగ్ర వ్యక్తులు దీనిని ధృవీకరించారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, నవాజ్ షరీఫ్ కుమార్తె, మరియం నవాజ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశం ప్రతీకార దాడులలో గాయపడిన సైనికులను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇద్దరు నాయకులు విడుదల చేశారు. దీంతో భారతదేశం పాకిస్తాన్‌లోని అనేక సైనిక స్థావరాలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది.
ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను అసిమ్ మునీర్ పరామర్శించారు. ఎల్‌వోసీ ఆర్టిలరీ కాల్పుల్లో, వివిధ వైమానిక స్థావరాలపై దాడుల్లో మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల పేర్లను ఆయన ఎందుకు వెల్లడించడం లేదు? ఎల్‌ఓసీ వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35-40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆసుపత్రిలో కలిశారు. ఆ తరువాత అతను చికిత్స పొందుతున్న సైనికులను కలుస్తున్నట్లు చిత్రాలలో స్పష్టంగా కనిపించింది.
ఆ తరువాత, ఎల్‌ఓసిపై ఫిరంగి కాల్పులు మరియు వివిధ వైమానిక స్థావరాలపై దాడుల సమయంలో మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల పేర్లను ఆయన ఎందుకు వెల్లడించడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. నివేదికల ప్రకారం, నియంత్రణ రేఖ వద్ద 50 మందికి పైగా సైనికులు మరణించారు. వైమానిక దాడుల్లో 35-40 మంది సైనికులు మరణించారు. కానీ పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని పదే పదే దాచిపెడుతోంది.
Asim Munir is meeting Pakistan Army soldiers injured in #OperationSindoor. Why isn’t he revealing names of Pakistan Army soldiers killed in LoC Artillery firing and during attacks at various Airbases? 50+ soldiers at LoC and 35-40 soldiers in Airstrikes. pic.twitter.com/9g1LNS4ixH
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 12, 2025
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సోమవారం(మే 12) లాహోర్‌లోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (CMH) ను సందర్శించి, భారతదేశంతో సైనిక ఘర్షణలో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సైనికుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘర్షణలో మరణించిన, గాయపడిన సైనికుల సంఖ్య గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఒక వీడియోలో, మరియం నవాజ్ సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సైనికులను వారి ఆరోగ్యం గురించి అడుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తరువాత భారతదేశం చేసిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసిందని స్పష్టమవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..