AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షేక్ హసీనాకు బిగ్ షాక్.. అవామి లీగ్ పార్టీని నిషేధించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ (ICT-BD) నోటిఫికేషన్ ప్రకారం షేక్ హసీనా అవామీ లీగ్‌ నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తయ్యే వరకు ఆపార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం 2025 కింద నిషేధించినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 18 ప్రభుత్వానికి ఏదైనా సంస్థ ఉగ్రవాదంలో పాల్గొన్నట్లు ప్రకటించే అధికారం ఇస్తుంది.

షేక్ హసీనాకు బిగ్ షాక్.. అవామి లీగ్ పార్టీని నిషేధించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
Sheikh Hasina
Balaraju Goud
|

Updated on: May 13, 2025 | 9:54 AM

Share

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్‌ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల ముందు, ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం షేక్ హసీనా అవామీ లీగ్‌ను అధికారికంగా నిషేధించింది. దీని ద్వారా ఆ దేశ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ విచారణ పెండింగ్‌లో ఉన్న ఉగ్రవాదంలో పాల్గొన్న సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం తెలిపారు.

అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ (ICT-BD) నోటిఫికేషన్ ప్రకారం షేక్ హసీనా అవామీ లీగ్‌ నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తయ్యే వరకు ఆపార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం 2025 కింద నిషేధించినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 18 ప్రభుత్వానికి ఏదైనా సంస్థ ఉగ్రవాదంలో పాల్గొన్నట్లు ప్రకటించే అధికారం ఇస్తుంది. అది సహేతుకమైన కారణాల ఆధారంగా ఉగ్రవాద అనుబంధ సంస్థగా ప్రకటించే అధికారం ఇస్తుందని ఆయన అన్నారు.

2009 నాటి అసలు ఉగ్రవాద నిరోధక చట్టంలో సంస్థని నిషేధించే నిబంధన లేదు. అయినప్పటికీ, అవామీ లీగ్ రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసింది. భవిష్యత్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆ పార్టీని అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల తర్వాత, హోం మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలను నిషేధించిందని బోట్ కమిషన్ కార్యదర్శి అక్తర్ అహ్మద్ తెలిపారు. ఈ క్రమంలో, అవామీ లీగ్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఆదివారం(మే 11) రాత్రి, అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు, చట్టం ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు మద్దతుగా పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా కంటెంట్, బహిరంగ సభలను నిషేధిస్తున్నారు. సలహాదారుల మండలి, ప్రధాన సలహాదారు యూనస్ నేతృత్వంలోని మంత్రివర్గం, ఉగ్రవాద నిరోధక చట్టం-2009కి మార్పులను ఆమోదించిన కొన్ని గంటల తర్వాత, ఒక నిర్దిష్ట సంస్థ అన్ని కార్యకలాపాలపై నిషేధం విధించిన కొన్ని గంటల తర్వాత ఈ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు.

UN హక్కుల కార్యాలయ నివేదిక ప్రకారం, జూలై 15 – ఆగస్టు 15 మధ్య దాదాపు 1,400 మంది మరణించడంతో అవామీ లీగ్ ప్రభుత్వం ఆగస్టు 5, 2024న కూలిపోయింది. వారిలో చాలామంది అవామీ లీగ్ మద్దతుదారులు పోలీసులపై ప్రతీకార చర్యలకు గురయ్యారు. 1949లో ఏర్పడిన అవామీ లీగ్, అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో బెంగాలీల స్వయంప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. చివరికి 1971లో విముక్తి యుద్ధానికి నాయకత్వం వహించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..