Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులు, మావోయిస్టుల ఎదురుకాల్పులు.. నక్సలైట్ మృతి..
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మళ్లీ కాల్పుల మోత మోగింది. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మళ్లీ కాల్పుల మోత మోగింది. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, మరికొంత మంది మావోయిస్టుల కూడా చనిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇటీవల ఛత్తీస్‌గడ్‌లో నక్సల్స్-జవాన్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు మృతి చెందగా.. 31 మందికి గాయాలపాలయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. మావోయిస్టుల చర్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మావోయిస్టుల చర్యను ఖండించారు. మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ ప్రకటించారు. అధికారులు సైతం ఈ ఘటనతో అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
Also read:
Ugadi 2021: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ? ఆరోజున చేసే పచ్చడిని ఎందుకు చేసుకుంటురో తెలుసా