AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2021: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ? ఆరోజున చేసే పచ్చడిని ఎందుకు చేసుకుంటురో తెలుసా

Ugadi 2021: ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం - జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి.

Ugadi 2021: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ? ఆరోజున చేసే పచ్చడిని ఎందుకు చేసుకుంటురో తెలుసా
Ugadi
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 8:20 PM

Share

Ugadi 2021: ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముక్యత ఉంది. ఉగాది రోజున పంచాంగ శ్రావణం జరుపుతుంటారు. నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటారు. ప్రస్తుతం శార్వారి నామ సంవత్సరం నడుస్తుండగా.. ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ క్రమంలో అసలు ఈ ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు… దాని చరిత్ర ఎంటో తెలుసుకుందామా.

ఉగాది తేదీ..

ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13న జరుపుకుంటారు.

ఉగాది సమయం..

తిథి.. ఏప్రిల్ 12 ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 13 ఉదయం 10.16 గంటలకు ముగుస్తుంది.

ఉగాది ప్రాముఖ్యత..

చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని.. ఆరోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని.. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతుంటారు. వేదాలను హారించాడని.. సోమకుని వధించేందుకు విష్ణువు మత్య్సవతారంలో వచ్చి అతడిని వధించాడని.. ఆ తర్వాత ఆ వేదాలను తీసుకోని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడని ఆరోజు నుంచే ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతుంటారు. ముఖ్యంగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని చెబుతుంటారు. అలాగే ఉగాది నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ కథతో పాటు మరో స్టోరీ కూడా పురణాల్లో ఉంది.

శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడని.. ఆరోజునే ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితిగా వచ్చిందని చెబుతుంటారు. “ఉగ” అంటే నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అంటారు. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం అంటారు. ఆ యుగానికి ఆది యుగాదిగా మారిదంని.. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది రూపొందిందని అంటుంటారు. ఇక పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వాగా జరుపుకుంటారు. తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖీ అని, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ అనే పేర్లతో జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత..

Ugadi Pachadi

Ugadi Pachadi

ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి. ఇందులో వాడే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయి. మరీ అవెంటో చుద్దామా..

* బెల్లం- తీపి… ఆనందానికి గుర్తు. * వేప పువ్వు – చేదు… జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తు. * చింతపండు – పులుపు.. నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు. * ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. * పచ్చి మామిడి ముక్కలు – వగరు.. కొత్త సవాళ్లు * కారం – సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

Also Read: షూగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..