Horoscope Today: ఈ రాశి వారు వారి పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today: ఆదివారం అమావాస్య తిథి పూర్తిగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 08:57 నిమిషాల వరకు ఉంటుంది. ఆదివారం అమృత ఘడియలు లేవు. ఈ రోజు వర్జ్యం...
Horoscope Today: ఆదివారం అమావాస్య తిథి పూర్తిగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 08:57 నిమిషాల వరకు ఉంటుంది. ఆదివారం అమృత ఘడియలు లేవు. ఈ రోజు వర్జ్యం రాత్రి 10.13 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం విషయానికొస్తే సాయంత్రం 4.48 గంటల నుంచి 05.38 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈరోజు దుర్గ అమ్మవారి ఆరాధణకు, పితృదేవత సంబంధమైన కార్యక్రమాలకు మంచిది. ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం…
మేష రాశి..
మేష రాశి వారు ఈరోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వ్యవహరించకూడదు. సుదర్శన స్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.
వృషభరాశి..
ఈ రాశి వారు చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఒప్పందాలను సమీక్ష చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి..
మిథున రాశి వారు ఈరోజు ఉద్యోగ, వ్యాపార సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. ముఖ్యమైన ప్రయాణాలపై కూడా సమీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నందీశ్వరుని పూజా, దర్శనం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. శనేశ్వర స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
సింహ రాశి..
సింహ రాశి వారికి ఈరోజు వ్యవహారిక విషయాలు ఫలించే సూచనలు కనిపిస్తు్న్నాయి. అనుకోని కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి. శివ పంచాక్షరి జపం చేస్తే వీరికి మంచి జరుగుతుంది.
కన్య రాశి..
ఈ రాశి వారు వ్యక్తిగత కార్యక్రమాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఎలాంటి పనులు చేపట్టకూడదు. నవగ్రహ అర్చన, ప్రదక్షణ మేలు చేస్తుంది.
తులా రాశి..
తులా రాశి వారు ఈరోజు చేపట్టే కార్యక్రమాల విషయంలో పెద్ద వారి సూచనలు స్వీకరించడం మంచిది. ఆహార, విహారాధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ నారసింహ వారి దర్శనం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఈరోజు వ్యాపార, వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక అంశాల పట్ల అవగాహన పెంచుకోవడం మంచిది. దుర్గా అమ్మవారి దర్శనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శివాభిషేకం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మకర రాశి..
ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపార పరమైన భావనలు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి సన్నిహితుల నుంచి మంచి సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విష్ణు సహస్త్ర నామ పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మీన రాశి..
ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. వాహనయోగాలు కూడా కలిసొస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం, శ్రీ రామ రక్ష స్తో్త్ర పారాయణం మేలు చేస్తుంది.
Also Read: Ugadi 2021: దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా..
TTD: తిరుమల దేవస్థానంలో అర్చకుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల..