AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2021: దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా..

Ugadi 2021: ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం అనేది ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీనిని తెలుగు వారి పండుగ అంటుంటారు.

Ugadi 2021: దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా..
Ugadi 2021
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2021 | 10:39 PM

Share

Ugadi 2021: ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం అనేది ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీనిని తెలుగు వారి పండుగ అంటుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగ వస్తుంది. అయితే ఈ పండగను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు రకాలుగా జరుపుకుంటారు.

ఆంధ్రప్రదేశ్.. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మత్య్సావతారం ఎత్తిన రోజు ఇదేనని అంటుంటారు. ఈరోజు బ్రహ్మదేవుడిని గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటారు. ఈరోజున ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు. ఈరోజు ఇంట్లో పిండి వంటలతోపాటు, షడ్రుచులతో పచ్చడిని చేసుకుంటారు. ఈరోజున పచాంగ శ్రావణం చేస్తుంటారు.

కర్నాటక కర్ణాటకలో ఈ పర్వదినాన చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. ఈ చైత్ర నవమి అనేది ఈ రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఇందులో నవరాత్రులను ఘనంగా జరుపుతారు. చివరి రోజు రామనవమిని అంటే రాముని జన్మతిథిని మరింత వైభవంగా జరుపుకుంటారు. ఈరోజున పచాంగ శ్రావణం చేస్తుంటారు. దీనిని చదివిన పూరోహితులకు కానుకలు అందిస్తారు.

మహారాష్ట్ర మహారాష్ట్ర గుడి పద్వాగా ఉగాదిని మహారాష్ట్రలో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని ఇక్కడి వారి నమ్మకం. ఈ రోజునే సత్యయుగం ప్రారంభమైందని నమ్మకం. అందువలన, ఈ రోజున అనేక ఆచారాలను కచ్చితంగా పాటిస్తారు. రంగురంగుల ముగ్గును ఇంటి ముంగిట అలంకరిస్తారు. ఈ ఆచారాన్ని మహారాష్ట్రలో ఉగాది రోజున వైభవంగా జరుపుకుంటారు.

తెలంగాణ

ఈరోజున పచ్చడి చేసుకోవడమే కాకుండా.. బొబ్బట్లను చేసుకుంటారు.. తెలంగాణలో బొబ్బట్లు ప్రత్యేకం. ఇక్కడ కూడా తెలుగు పంచాంగ శ్రావణం చేస్తుంటారు. దీనిని కొంత మంది ఇళ్ళలో పంచాగ శ్రావణం చేయిస్తారు. అలాగే గుడిలో పూజారులు కూడా పంచాంగ శ్రావణం చేస్తుంటారు.

Also Read: బాలీవుడ్‏లోకి ‘అపరిచితుడు’.. విక్రమ్ పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరో… అక్కడ కూడా హిట్టు కొట్టేనా ?

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…