Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళ రాజకీయాల్లో మళ్లీ తలైవా.. రజనీకాంత్ మద్దతు ఆ పార్టీకేనా..?

తమిళనాడులో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దేశంలోనే ఎక్కడా లేనన్ని రాజకీయ పార్టీలను ఆ రాష్ట్రంలో మాత్రమే చూడగలం. ఇక సినీ నటుల ప్రభావం కూడా తమిళ రాజకీయాల్లో ఎక్కువే. నాటి ఎం.జి రామచంద్రన్ మొదలు ఇటీవల విజయ్ కాంత్ వరకు అక్కడి రాజకీయాల్లో ప్రభావం చూపిన వారే. కొందరు నేరుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే మరి కొందరు నటులు కొన్ని పార్టీల తలరాతలను మార్చేశారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే పొలిటికల్ వ్యవహారంపై దశాబ్దాలుగా చర్చ జరిగింది.

Tamil Nadu: తమిళ రాజకీయాల్లో మళ్లీ తలైవా.. రజనీకాంత్ మద్దతు ఆ పార్టీకేనా..?
OPS and Rajinikanth
Follow us
Ch Murali

| Edited By: Aravind B

Updated on: Sep 02, 2023 | 7:21 PM

తమిళనాడులో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దేశంలోనే ఎక్కడా లేనన్ని రాజకీయ పార్టీలను ఆ రాష్ట్రంలో మాత్రమే చూడగలం. ఇక సినీ నటుల ప్రభావం కూడా తమిళ రాజకీయాల్లో ఎక్కువే. నాటి ఎం.జి రామచంద్రన్ మొదలు ఇటీవల విజయ్ కాంత్ వరకు అక్కడి రాజకీయాల్లో ప్రభావం చూపిన వారే. కొందరు నేరుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే మరి కొందరు నటులు కొన్ని పార్టీల తలరాతలను మార్చేశారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే పొలిటికల్ వ్యవహారంపై దశాబ్దాలుగా చర్చ జరిగింది. ఒక దశలో రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ఫిక్స్ అన్న చర్చ జరిగింది. 2017 డిసెంబర్‎లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో వరుస భేటీలు జరిపారు. వేలాదిమంది అభిమానులతో నేరుగా చర్చించారు. ఆ సందర్భంలో దేవుడు ఆదేశించిన నాడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్నారు. 2021లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను రాజకీయాల్లోకి రాలేనని తేల్చేశారు.

ఇక రజనీ ఎంట్రీతో తమిళనాట పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తర్వాత జయలలిత, నెచ్చెలి చిన్నమ్మ శశికళ ఎడీఎంకే నుంచి బహిష్కరణ తర్వాత మేనల్లుడు స్థాపించిన అమ్మా మక్కల్ మున్నెట్ర కలగం‎ను యాక్టివేట్ చేయాలని చూశారు. ఆ సందర్భంలో రజనీకాంత్‎తో భేటి అయ్యి తమకు మద్దతుగా ఉండాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిణామాలతో శశికళ సైలెంట్ అయ్యారు. శశికళ వెళ్లినా ఎడీఎంకేలో రచ్చ మాత్రం తగ్గలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడపాడి పలనీ స్వామి వర్గాల పోరు ముదిరింది. ఆధిపత్యం కోసం జరిగిన రచ్చలో వ్యూహంతో ఈపీఎస్‎ను బహిష్కరించి పార్టీలో బలాన్ని పెంచుకున్నారు. ఇక అలా కాదు సొంత పార్టీతో సత్తా చాటుదామంటూ తన వర్గాన్ని సిద్ధం చేస్తున్నారు అమ్మ జయలలిత నమ్మకస్తుడు ఈపీఎస్.

అమ్మ పేరు వచ్చేలా కొత్త ద్రవిడ పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారు ఓపీఎస్. ఇందుకోసం ఓటర్లపై బలంగా ప్రభావం చూపే వారి మద్దతు కూడగట్టి ఓట్లను రాబట్టే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు.. ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్‎తో భేటి అయి రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని, ప్రయత్నాలను వివరించిన ఓపీఎస్.. తలైవా రజనీకాంత్ మద్దతు కోరారని కొందరు నేతలు చెబుతున్న మాట. దీంతో మరోసారి తమిళ రాజకీయాల్లో తలైవా పేరు చర్చనీయాంశంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపించిన ప్రతిసారి తలైవా ప్రస్తావన లేని ఎన్నికలే లేవు. ఇక తాను రాజకీయాల్లోకి రానని తేల్చిన తర్వాత కూడా తలైవా ప్రస్తావన స్పష్టంగా కనబడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..