AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Nation-One Election: వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక హై లెవర్ కమిటిలో సభ్యులుగా.. అమిత్‌ షా, అధీర్‌ రంజన్‌ చౌదరి,గులాంనబీ ఆజాద్‌, NK సింగ్‌, హరీష్‌ సాల్వే, సుభాష్‌ కశ్యప్‌‌లను నియమించింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఈ కమిటీ కసరత్తులు చేయనున్నట్లు తెలుస్తోంది.

One Nation-One Election: వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం..
One Nation, One Election
Aravind B
|

Updated on: Sep 02, 2023 | 6:30 PM

Share

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక హై లెవర్ కమిటిలో సభ్యులుగా.. అమిత్‌ షా, అధీర్‌ రంజన్‌ చౌదరి,గులాంనబీ ఆజాద్‌, NK సింగ్‌, హరీష్‌ సాల్వే, సుభాష్‌ కశ్యప్‌‌లను నియమించింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఈ కమిటీ కసరత్తులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించడంతో అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా జమిలి ఎన్నికల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండియా కూటమిలోని పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో జమిలి ఎన్నికల కోసమే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయని సంకేతాలందుతున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు అనేక రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నా కూడా.. అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుకు ఈ పార్టీల మధ్య అవగాహన కుదరేలా కనిపించడం లేదు.

పంజాబ్‌, ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పంజాబ్‌, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల విషయంలో సీట్ల సర్దుబాటు చేసుకున్నా అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరదు. ఇక కేరళలో లెఫ్ట్ కూటమి అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ కూటమి ప్రతిపక్షంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వీరి మధ్య అవగాహన ఎలా కుదురుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి తరపున ఎలాగోలా సీట్ల సర్దుబాటు చేసుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా సర్దుబాటు చేసుకుంటారనేది అంతుబట్టని వ్యవహారం.

ఇవి కూడా చదవండి

ఇక జమ్మూ కశ్మీర్‌ విషయానికొస్తే పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బద్ధ శతృవులు. లోక్‌సభ ఎన్నికలకు అంగీకారం కుదిరినా అసెంబ్లీ ఎన్నికల్లో వీరి మధ్య అవగాహన కుదరడం దాదాపు అసాధ్యమే. ఏకకాలంలో లోక్‌సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే ఇండియా కూటమిలోని పార్టీలే పరస్పరం తలపడాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింప చేసుకునేందుకు కావాల్సిన సంఖ్యాబలం ఉండటంతో బీజేపీ దూకుడుగా ఉంది. బిల్లు ఆమోదం పొందితే ఇండియా కూటమిలోని పార్టీలు అదే కూటమిలో కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే లోక్‌సభకు సర్దుబాటు చేసుకుని, అసెంబ్లీలో పరస్పరం తలపడటం సాధ్యం కాదు. ఇదే జరిగితే కూటమిలో అనేక పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కూటమినుంచి వైదొలిగే అవకాశాలే ఎక్కువ.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి