TV9 Telugu
16 March 2025
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 10 జట్లు ఆడనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూసేందుక అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలను పూర్తి చేశాయి.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు సృష్టించింది.134 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
పంజాబ్ కింగ్స్ కూడా ఢిల్లీ జట్టు తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 133 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 128 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 117 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో ముంబై 115 ఓటములతో 5వ స్థానంలో ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 106 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో, CSK కేవలం 98 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిని చవిచూసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 91 పరాజయాలను చవిచూసింది. ఇది కాకుండా, లక్నో 19 మ్యాచ్‌ల్లో, గుజరాత్ 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.