AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: విమానం దిగిన ప్రయాణీకుల్లో ఇద్దరు తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా

కర్నాటకలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను చేధించారు పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టారు. విదేశీ మహిళలను ముందు పెట్టి.. కథ నడిపిస్తున్న డ్రగ్స్ పెడ్లర్లపై ఫోకస్ పెట్టారు మంగళూరు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి

Viral: విమానం దిగిన ప్రయాణీకుల్లో ఇద్దరు తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
Airport
Ravi Kiran
|

Updated on: Mar 17, 2025 | 7:00 AM

Share

బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 75 కోట్ల విలువైన దాదాపు 38 కిలోల మాదకద్రవ్యాలతో ఇద్దరు నైజీరియన్ మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. ఇది కర్నాటకలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ అని తెలిపారు పోలీసులు. బాంబా ఫాంటా, అబిగైల్ అడోనిస్ అనే ఇద్దరు మహిళలు తమ ట్రాలీ బ్యాగుల్లో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఢిల్లీ నుండి బెంగళూరుకి వచ్చిన మహిళలను పక్కా సమాచారంతో ఎయిర్ పోర్టులో దిగగానే అరెస్టు చేశారు. వారి నుంచి 37 కేజీల 870గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసినట్లు.. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. నాలుగు మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌లు, 18వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఢిల్లీలో నివసిస్తూ.. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలను చేరవేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది వీరిద్దరూ.. ముంబైకి 37సార్లు, బెంగళూరుకు 22 సార్లు ప్రయాణం చేశారని ట్రావెల్ హిస్టరీ బయటపెట్టారు.

2020లో నిందితురాలు ఫాంటా బిజినెస్ వీసాపై భారతదేశానికి రాగా.. మరో నిందితురాలు అడోనిస్… 2016 నుండి దేశంలోనే ఉంటున్నారని సీపీ అనుపమ్ తెలిపారు. ఇద్దరు మహిళలు రెండేళ్లుగా డ్రగ్స్ స్మగ్లింగ్ పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని 15 గ్రాముల డ్రగ్స్ తో పట్టుకున్నప్పుడే ఈ ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత 6 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ జాతీయుడు పీటర్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ రాకెట్ ని ఛేదించినట్లు తెలిపారు మంగళూరు సీపీ. వీరి వెనుక ఎవరున్నారు, ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నదెవరు అనే దానిపై ఫోకస్ పెట్టారు.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..