IPL 2025: మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు ఖతర్నాక్ ఎంట్రీ
IPL 2025 ప్రారంభానికి ముందు, ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ఐపీఎల్ జట్టు శిక్షణా శిబిరంలో కనిపించాడు. ఓ ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఆడే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ టీం ఏంటి.? ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఐపీఎల్ 18వ సీజన్ కాగా, ఈసారి ట్రోఫీ కోసం ప్రతీ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. అదే సమయంలో ఒక జట్టు వేలంలో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఈ జట్టులోని 3 ఫాస్ట్ బౌలర్లు ఇంకా ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేయలేదు. ఇంతలోనే ఆ జట్టు క్యాంప్ నుంచి ఓ షాకింగ్ ఫోటో బయటకొచ్చింది. మెగా వేలంలో అమ్ముడుపోని ఓ ప్లేయర్.. ప్రస్తుతం ఫిట్‌నెస్ క్లియర్ చేయని ఒక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు అతడ్ని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తీసుకోవాలని చూస్తోంది. ఇటీవల శార్దూల్ ఠాకూర్ LSG శిక్షణా శిబరంలో కనిపించాడు. అతడు లక్నోలో LSG ఆటగాళ్లు, ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి హోలీ జరుపుకున్నాడు. ఇదే కాకుండా, ఎల్‌ఎస్‌జి శిక్షణా కిట్‌లో శార్దూల్ ఫోటో కూడా వైరల్ అవుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఇంకా జట్టుతో చేరలేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడటానికి ఎన్‌సీఏ నుంచి అనుమతి రాలేదు. ఇలాంటి పరిస్థితిలో శార్దూల్ ఠాకూర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు గాయపడితే, ఫ్రాంచైజీ ఆ ఆటగాడి స్థానంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఒకరిని జట్టులోకి తీసుకోవచ్చు.
🚨🚨🚨🚨🚨 SHARDUL THAKUR WITH RISHABH PANT CELEBRATING HOLI IN THE LSG CAMP. pic.twitter.com/oTE80KFO0C
— AYUSH JINDAL (@AYUSHJI65302777) March 15, 2025
శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్..
శార్దుల్ ఠాకూర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 5 జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో అతడు 95 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 9.22 ఎకానమీతో 94 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్‌తో 307 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ గత ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను 9 మ్యాచ్‌లు ఆడి.. కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మెగా వేలానికి ముందు అతడ్ని సీఎస్‌కే రిలీజ్ చేయగా.. ఫ్రాంచైజీలు ఎవ్వరూ అతడ్ని కొనుగోలు చేయలేదు.
Shardul Thakur bowling in LSG camp! 👀 #IPL2025 #lsg pic.twitter.com/rKiMd9hsVB
— Paramjit Singh (@paramjit3092) March 15, 2025