- Telugu News Photo Gallery Cricket photos Know the Opening Pairs Of Every Team In IPL 2025, SRH Stands On Top Place
IPL 2025: ఐపీఎల్ 2025లో అరవీర భయంకరులు వీరు.. బెస్ట్ ఓపెనింగ్ జోడీ ఏ టీమ్‌దో తెల్సా..
మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ప్రతీ జట్టు తమ ఓపెనర్లతో ప్రత్యర్ధులను భయపెట్టాలని చూస్తోంది. మరి ప్రతీ జట్టు ఓపెనింగ్ పెయిర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీ ఓసారి చూసేయండి.
Updated on: Mar 17, 2025 | 10:30 AM

లక్నో సూపర్ జెయింట్స్.. ఈ జట్టుకు ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయవచ్చు. ఇద్దరికీ ఓపెనింగ్‌లో పెద్దగా మంచి రికార్డులు లేవు. అటు ఈ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఓపెనింగ్‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ టీంకు ఓపెనింగ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్. అతడితో లాస్ట్ సీజన్ ఓపెన్ చేసిన అభిషేక్ పోరెల్. అలాగే ఫాఫ్ డుప్లెసిస్, కెఎల్ రాహుల్ లాంటి ఓపెనర్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈసారి మెక్‌గర్క్, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్.. ఈ జట్టుకు చాలా డీసెంట్ ఓపెనింగ్ పెయిర్ ఉంది. రెగ్యులర్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఓపెనింగ్ దిగనున్నారు. ఖచ్చితంగా ఈ పెయిర్ డేంజరస్‌గా మారే ఛాన్స్‌లు ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్.. గత సీజన్‌లో ఓపెనర్‌గా సునీల్ నరైన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. మళ్లీ ఓపెనర్‌గా కంటిన్యూ కావచ్చు. ఇక అతడికి పార్ట్‌నర్‌గా రెగ్యులర్ ఓపెనర్ డికాక్ లేదా గుర్బాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్.. ఈ జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎప్పటిలానే మ్యాచ్ ఓపెన్ చేయనుండగా.. అతడితో పాటు ఈసారి విల్ జాక్స్ ఓపెనింగ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్.. ఈ జట్టు ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ఇంప్రూవ్డ్ ఓపెనింగ్ పెయిర్ ఉంది. వాళ్లెవరో కాదు రుతురాజ్ గైక్వాడ్, న్యూజిలాండ్ బ్యాటర్ డివాన్ కాన్వె. వీరిద్దరూ కూడా 2023లో సీఎస్కే కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈసారి ఆర్సీబీ టీం కొత్త ఓపెనింగ్ పెయిర్‌ను బరిలోకి దింపనుంది. విరాట్ కోహ్లీతో పాటు కొత్తగా వచ్చిన ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్ దిగనున్నాడు. వీరిద్దరూ కూడా గేర్ మారిస్తే.. కచ్చితంగా అగ్రెషన్‌తో ఆడతారు.

రాజస్థాన్ రాయల్స్.. జాస్ బట్లర్ ఈ ఏడాది లేకపోవడంతో.. రాయల్స్ జట్టులో ఐపీఎల్ 2025లో డెడ్లీ ఓపెనర్లు బరిలోకి దిగనున్నారు. వారే సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్. ఇద్దరూ కూడా టీమిండియా ఓపెనర్లు కావడం ఒక ఎత్తయితే.. వీరిద్దరూ కూడా డిస్ట్రిక్టివ్.

గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఈ జట్టుకు అరివీర భయంకర ఓపెనర్లు బరిలోకి దిగనున్నారు. శుభ్‌మాన్ గిల్, జాస్ బట్లర్.. వీరిద్దరూ కుదురుకుంటే.. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2025లో బిగ్గెస్ట్ పవర్ హిట్టర్స్.. అలాగే వీరిద్దరూ కూడా డిస్ట్రిక్టివ్ ఓపెనర్స్.. బరిలోకి దిగితే ఉరుములు, మెరుపులు పడినట్టే.





























